ఓ విజయ సాయి రెడ్డి.. ఓ దువ్వాడ శ్రీనివాస్.. ఓ అంబటి రాంబాబు.. ఓ అవంతి శ్రీనివాస్.. ఓ గోరంట్ల మాధవ్.. లిస్టులో ఇంకెన్ని పేర్లున్నాయో.. ఎప్పుడు ఎవరి పేరు బయటకు రాబోతోందో.!
విజయనగరం జిల్లాకి చెందిన ఓ కీలక నేతకు సంబంధించిన బాగోతం ఒకటి బయటకు రాబోతోందంటూ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ మంత్రి గురించీ, టీడీపీ నుంచి వైసీపీలోకి దూకిన ఓ మాజీ ఎమ్మెల్యే గురించీ.. అబ్బో, పుకార్లు షికార్లు చేసేస్తున్నాయ్.
ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అన్నట్లుగా, మహిళా నేతలపైనా ఇవే తరహా ఆరోపణలు ప్రచారంలోకి వస్తున్నాయి. అసలేం జరుగుతోంది వైసీపీలో.?
తన భర్త వేరే మహిళతో ‘రంకు’ సాగిస్తున్నారంటూ సాక్షాత్తూ వైసీపీ నేత దువ్వాడ వాణి మీడియాకెక్కడం, ఈ విషయమై దువ్వాడ శ్రీను కూడా మీడియా ముందుకొచ్చి దాదాపు ఆ వ్యవహారాన్ని ఒప్పుకోవడం తెలిసిన విషయాలే. మూడో వ్యక్తి (మహిళ) తనకు, దువ్వాడతో వున్న సంబంధాన్ని బయటపెట్టడం ఇంకాస్త ఆసక్తికరం.
అసలు ఇదంతా ఎలా జరిగింది.? ఎందుకు జరిగింది.? అంటే, ‘అన్నా, ముందైతే దువ్వాడ శ్రీనివాస్‌ని పార్టీ నుంచి బయటకు పంపెయ్.. అంబటి, అవంతి లాంటోళ్ళని కూడా పార్టీలో వుండనివ్వొద్దు..’ అంటూ వైసీపీ క్యాడర్, తమ అధినేతను ఉద్దేశించి ట్వీట్లేస్తున్నారు.
‘గడప గడపకీ వైసీపీ’ అంటే ఇదేనా.? అన్న చర్చ తెరపైకొస్తోంది. ‘పక్కింటి గడప తొక్కి’ వైసీపీ నేతలు, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంపై జనబాహుళ్యంలోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వం, ఈ బాగోతాలపై స్పెషల్ ఫోకస్ గనుక పెడితే, వైసీపీలో ‘సచ్ఛీలురు’ ఎవరైనా మిగులుతారా.? అన్న ప్రశ్న కూడా ప్రజల నుంచి ఉత్పన్నమవుతుండడం కొసమెరుపు. ఇదంతా సోషల్ మీడియా వేదికగా సాధారణ ప్రజానీకం వ్యక్తం చేస్తున్న అభిప్రాయమే సుమీ.!