ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా ముందు ఆ మంచి మాటల్ని కీలక పదవుల్లో వున్న వ్యక్తులు ఆచరించి తీరాలి.
నిజమే, రాజ్యాంగం భారతదేశానికి క్రమశిక్షణ నేర్పే నిబంధనల పుస్తకమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎప్పటినుంచో వింటూనే వున్నాం ఈ మాట. కానీ, ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు.? జనం సంగతి తర్వాత, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో వున్నవారు ‘లంజత్వం’ అంటూ నోరు పారేసుకుంటున్న రోజులివి. క్షమించాలి.. ఆ బూతు మాటని ఇక్కడ ప్రస్తావిస్తున్నందుకు.. కానీ, తప్పడంలేదు.!
మంత్రి పదవిలో వున్న వ్యక్తి, ‘నీ యమ్మ మొగుడు..’ అంటూ రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకు పడటం చూశాం. ఇవన్నీ వైసీపీ హయాంలో జరుగుతున్నవే. అధికార వైసీపీ నుంచి ఇంత ఛండాలమైన మాటలు వస్తోంటే, విపక్షాలు ఆగుతాయా.? ముఖ్యమంత్రి మీద ‘బోసడీకే’ అంటూ చెలరేగిపోతున్నారు విపక్ష నేతలు.
రాజకీయ పార్టీల కార్యాలయాల మీదకు తమ పార్టీ కార్యకర్తలు దాడులకు వెళ్ళి, విధ్వంసాలు సృష్టించి, హత్యాయత్నాలు చేస్తే, ‘మా పార్టీ కార్యకర్తలకు బీపీలు వస్తాయ్..’ అని ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ శ్రేణుల్ని వెనకేసుకొచ్చారు.
రాజ్యాంగం.. అంటే, రాజుగారి ‘అదేదో’ అన్నట్లుగా తయారైపోయిందిప్పుడు పరిస్థితి. అధినేత మెప్పు కోసం అడ్డమైన వేషాలూ వేస్తున్నారు కీలక పదవుల్లో వున్న వ్యక్తులు. అలాంటివారిని ‘అచ్చోసిన ఆంబోతుల్లా’ మేపుతున్నారు అధికారంలో వున్నవారు. విపక్ష నేతలు నోరు జారినా అది తప్పిదమే.. అధికార పక్షం నోరు జారినా తప్పే.! నిజానికి, తప్పు చేయకపోవడమే అన్నిటికన్నా పెద్ద తప్పు.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించమని రాజ్యాంగం చెబుతోందా.? ప్రజా ఉద్యమాల్ని ఉక్కుపాదంతో అణచివేయమని రాజ్యాంగం చెబుతోందా.? రాజధాని ప్రాంతానికి కులాన్ని ఆపాదించమని రాజ్యాంగం చెబుతోందా.? చెప్పే మాటలకీ చేసే చేతలకీ అస్సలు పొంతన లేకపోయినా, ఉన్నత పదవుల్లో వున్నవారు సందర్భానుసారం నీతులైతే బహు బాగా చెప్పేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?