Switch to English

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.. అధికార పార్టీ నుంచి.. అలాగే, పోలీసు అధికారుల నుంచీ వచ్చింది. ఓ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా వుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.?

ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకోసమంటూ పదుల సంఖ్యలో అనుచరుల్ని వెంటేసుకుని, ఇతర పార్టీలకు చెందిన నేతలెవరైనా వెళితే, దాన్ని పోలీసులు అడ్డుకుంటారా.? లేదంటే, ‘వినత పత్రం కదా..’ అని ఊరుకుంటారా.? అప్పుడు అలా పోలీసు వ్యవస్థ లైట్ తీసుకుంది కాబట్టే, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడిలా చెలరేగిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ కార్యాలయాల మీద దాడులు జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పరిస్థితి మరీ అధ్వాన్నం. అక్కడ జరిగిన విధ్వంసం చూస్తే, ఇది రాజకీయ దాడి కాదు.. తీవ్రవాద దాడి.. అన్నట్టు తయారైంది పరిస్థతి.. అన్న భావన టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.

‘ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం..’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. అంతేనా, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్ర పతి పాలన పెట్టాలనే డిమాండ్ కూడా చేసేశారు ప్రతిపక్ష నేత.

సరే, చంద్రబాబు డిమాండ్ చేసేసినట్టు కేంద్రం అంత రిస్క్ చేస్తుందా.? అన్నది వేరే చర్చ. కానీ, రాష్ట్రంలో నేడు చోటు చేసుకున్న విధ్వంసం చూస్తే.. అధికార పార్టీ తప్ప, రాష్ట్రంలో ఇంకెవరూ వుండకూడదన్నట్టుగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు వ్యవహరిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తుంది.

ఇంతటి విధ్వంసాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించలేకపోవడమా.? ఏకకాలంలో రాష్ట్రంలోని పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు జరగడమా.? కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని మరీ దాడికి వెళ్ళడమంటే.. పక్కా ప్లానింగ్ ఈ మొత్తం దాడుల వ్యవహారం వెనుక వుండే వుండాలి.

టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద గంజాయి స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలతోనే, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని పరిస్థితి చెయ్యిదాటిందంటోన్న అధికార వైసీపీ కల్లబొల్లి కబుర్లనే పోలీసులూ వల్లించబోతున్నారా.? ఏమోగానీ.. రాష్ట్రం పరువు పోయింది.. దేశంలో ఈ తరహా విధ్వంసాలు బీహార్ తదితర రాష్ట్రాల్లో చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాటన్నిటికంటే ముందు వరుసలో నిలబెట్టేశారిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

స్టార్ మా కొత్త సీరియల్ “నువ్వు నేను ప్రేమ”

మరో కొత్త తరహా కథ తో స్టార్ మా ఓ సరికొత్త సీరియల్ ని అందించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ కొత్త సీరియల్ పేరు...

బాలీవుడ్ కామెంట్స్ విషయంలో మహేష్ ను సపోర్ట్ చేసిన కంగనా

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన బాలీవుడ్ కామెంట్స్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా దీనిపై రచ్చ చేస్తూనే...

రాజ్యసభ ఎన్నికల ముంగిట కేసీఆర్ ను కలిసిన ప్రకాష్ రాజ్

నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ గత రెండు రోజులుగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రిని కలుస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. నిన్న ఎర్రవెల్లిలో...

ఆచార్య ఓటిటి విడుదల ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ రిలీజ్ ఆచార్య ఫుల్ రన్ ను పూర్తి చేసుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది....

సర్కారు వారి పాట డే 1 కలెక్షన్స్: మహేష్ కెరీర్ హయ్యస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం మొదటి ఆట నుండే మిక్స్డ్...

రాజకీయం

అధికారంలో వున్నది ఏ దత్త పుత్రుడబ్బా.?

మళ్ళీ మళ్ళీ అదే మాట.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఇంకోసారి ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శలు చేసేశారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘రైతు...

ఓ జగన్.! ఓ అచ్చెన్న.! ఓ నారాయణ.! ఈ కథ ఇంతేనా.?

తమ అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచన చేయడంలేదా.? ప్రభుత్వాలు చేసే పరిపాలన గురించి అస్సలు ఆలోచన చేయడంలేదా.? ఎన్నికలొస్తున్నాయ్.. వెళుతున్నాయ్.! వాళ్ళు కాకపోతే వీళ్ళు.. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు.. ఈ రాజకీయం ఎప్పుడూ...

బాత్రూమ్‌లో గొడ్డలి పోటు.! బెంగళూరులో రసిక రంబోలా.!

కొత్త సినిమా టైటిల్ గురూ.! అనుకునేరు.. కాదు కాదు, అసలు విషయం వేరే వుంది. ఇది నీఛ నికృష్ట రాజకీయం. ఔను, బాత్రూమ్‌లో బాబాయ్ ఎలా గొడ్డలి పోటుకు గురైందీ, దాన్ని ఎలా...

పులిచింతల గేటు పెట్టలేరు.! పోలవరం ప్రాజెక్టు ఎలా కడతారు.?

వరదలొచ్చాయ్.. ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు రాజకీయం పకపకా నవ్వింది. పులిచింతల తమ ఘనతేనని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తలకాయ ఎక్కడ పెట్టుకుంటాయ్.?...

రంకు నేర్చిన రాజకీయం: కాముడెవరు.? రాముడెవరు.?

’రంకు‘ అనే మాటని వాడేందుకు చాలా చాలా అంతర్మధనం చెందాల్సి వస్తోంది. కానీ, తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజవ్కీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని వింత ఇది. నిజానికి,...

ఎక్కువ చదివినవి

“నేను ఏది పట్టుకుంటే అది బ్లాక్ బస్టర్ బ్రదర్” – మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎంత కాన్ఫిడెంట్ అంటే సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ కు తగ్గదు అని గట్టిగా చెబుతున్నాడు. నిన్న మేజర్ ట్రైలర్...

సింహమైతే.. ఎందుకు మొరుగుతోంది చెప్మా.?

పవన్ కళ్యాణ్ చుట్టూ పెద్ద రచ్చ జరుగుతోంది. చిన్న నవ్వు సమాధానంగా ఇస్తున్నారాయన రాజకీయాల్లో. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గురించి, కీలక పదవుల్లో వున్న వ్యక్తులు ‘మొరుగుతున్నారంటే’,...

అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్ లుక్ విడుదల

అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాల మీదే కాక ప్రస్తుతం సీరియస్ సబ్జెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాడు. గతేడాది విడుదలైన హార్డ్ హిట్టింగ్ డ్రామా నాంది ఆ కోవకు చెందిన సినిమానే....

స్టార్ మా కొత్త సీరియల్ “నువ్వు నేను ప్రేమ”

మరో కొత్త తరహా కథ తో స్టార్ మా ఓ సరికొత్త సీరియల్ ని అందించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ కొత్త సీరియల్ పేరు "నువ్వు నేను ప్రేమ". ఈరోజు సాయంత్రం 06.30...

రాశి ఫలాలు: బుధవారం 11 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:36 సూర్యాస్తమయం: సా.6:22 తిథి: వైశాఖ శుద్ధ దశమి మ.2:59 వరకు తదుపరి వైశాఖ శుద్ధ ఏకాదశి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: పుబ్బ మ.3:51 వరకు...