వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం సమీపంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయనను పోలీసులు A-71గా చేర్చారు. వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా పోలీసులు తన వాహనాన్ని అనుసరించి ఆయన నివాసం సమీపంలోనే అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వంశీని అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో.. హైదరాబాద్ నుంచి ఆయన వేరువేరు వాహనాల్లో గన్నవరానికి చేరుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఫోన్ నంబర్ కూడా మార్చినట్లు పోలీసులకు తెలిసింది. ఆ నంబర్ సిగ్నల్స్ ఆధారంగా ఆయనను పట్టుకున్నారు.
టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశారు. ఆ దాడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వంశీ ప్రోత్బలంతోనే జరిగిందని వారు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పోలీసులు ఈ కేసులో వంశీని A1 గా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అరెస్టు జరిగినట్లు సమాచారం.