రాజకీయ నాయకుల అరెస్ట్, బెయిల్.. ఇలాంటివన్నీ చాలా చాలా సర్వసాధారణమైన విషయాలు.! హత్య కేసుల్లో నిందితులుగా వున్నవారు సైతం, సిల్లీ రీజన్స్‌తో తప్పించుకుంటుంటారు. వ్యవస్థల్లో వున్న లోటుపాట్లు.. రాజకీయ నాయకులకీ, బడా పారిశ్రామిక వేత్తలకీ, పలుకుబడి వున్న ఇతరులకీ అంతలా ఉపయోగపడుతుంటాయ్.!
బెయిల్.. ఈ వ్యవహారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! అదో ప్రసహనం.! అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదేళ్ళకు పైగా ఎందుకు బెయిల్ మీదున్నారు.? అన్న ప్రశ్నకు సామాన్యులు సమాధానం కనుగొనలేరు.!
మెడికల్ గ్రౌండ్స్ అనండీ, ఇంకో కారణం అనండీ.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి సాధారణ బెయిల్ మంజూరయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు ఆర్థిక లబ్ది పొందినట్లు నిరూపించడంలో సీఐడీ విఫలమయ్యిందన్నది బెయిల్ సందర్భంగా ఉన్తన న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల సారాంశమట.
నిజానికి, ఈ కేసులో చంద్రబాబు అరెస్టే హాస్యాస్పదమైన ప్రక్రియని అప్పట్లో న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆ లెక్కన, రేపో మాపో చంద్రబాబుకి క్లీన్ చిట్ దొరికితే.. ఆ క్లీన్ చిట్ కోసమే వైఎస్ జగన్ సర్కారు, చంద్రబాబుని అరెస్టు చేయించి, ఆయనకు రాజకీయంగా మేలు చేసిందని భావించాల్సి వస్తుంది.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు అరెస్టు.. అన్న ప్రచారం ఇప్పటిదాకా సాగింది. రాష్ట్రంలో విపక్ష నేతల అరెస్టులు ఎడా పెడా జరుగుతుండడం ఈ తరహా ప్రచారాలకు బలం చేకూర్చడం సహజమే మరి.!
ఇక, చంద్రబాబుకి బెయిల్ రావడంపై వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రులూ, ‘వచ్చింది బెయిల్ మాత్రమే, క్లీన్ చిట్ కాదు..’ అంటున్నారు. మరి, వైసీపీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో క్లీన్ చిట్ వచ్చిందా.? ఆయనా బెయిల్ మీదనే వున్నారు కదా.!
రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వుంది.. తమ భవిష్యత్తు విషయమై.! ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత.. ఇద్దరూ బెయిల్ మీద వున్న వ్యక్తులే. ఆయా కేసుల్లో నిందితులుగా వున్నావారే.! అలాంటివారికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు వుంటుందా.. అని ప్రజలే ఆత్మవిమర్శ చేసుకోవాలి.!
ఇక, చంద్రబాబు అరెస్టు విషయమై అతిగా స్పందించిన వైసీపీ, బెయిల్ మీద అంతకన్నా అతిగా స్పందిస్తోంది. తద్వారా వైసీపీ తన భయాన్ని బయటపెట్టుకుంటోంది.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా, ‘తీవ్ర ఆర్థిక నేరాలకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్నప్పుడు బెయిల్ ఇవ్వకూడదు’ అని సుప్రీంకోర్టు పేర్కొనడాన్ని, చంద్రబాబు బెయిల్ వ్యవహారం సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాదుులు.. అందునా, రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ ప్రస్తావించడం.. వైసీపీ భయాన్ని చెప్పకనే చెబుతోంది. అయినా, వైసీపీ ఎందుకంత భయపడుతోందిప్పుడు.?
వైఎస్ జగన్ విదేశాలకు వెళ్ళాలంటే, న్యాయస్థానం అనుమతి పొందాలి. చంద్రబాబుకీ బెయిల్ సందర్భంగా కొన్ని షరతులుంటాయ్.! సో, రాష్ట్రంలో క్లీన్ చిట్ వున్న ముఖ్యమంత్రి అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అవుతారన్నమాట. ప్రజలు చైతన్యవంతులైతే, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. అదీ వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్న అంశం.