Switch to English

‘మత్తు’ డాక్టర్‌ ఎపిసోడ్‌లో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్‌ సర్కార్‌.!

‘మత్తు’ డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంలో అధికార పార్టీకి తిప్పలు తప్పేలా కన్పించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారంలో పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది. ‘దళిత కార్డు’ ఓ వైపు, పోలీసుల అత్యుత్సాహం బట్టబయలవడం ఇంకో వైపు.. వెరసి ప్రభుత్వానిది ‘మింగలేక.. కక్కలేక..’ అన్నట్టుంది పరిస్థితి.

ఇదిలా వుంటే, డాక్టర్‌ సుధాకర్‌ని ఈ నెల 20న (అంటే రేపే) కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. మద్యం మత్తులో రోడ్డు మీద నానా వీరంగం సృష్టించిన మత్తు డాక్టర్‌ సుధాకర్‌ని సమర్థించలేం. ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టాడాయన. ఓ బాధ్యతగల వైద్యుడు చేయాల్సిన పని కాదిది. కానీ, అదే సమయంలో.. ఆయనపై పోలీసుల దాష్టీకం ముమ్మాటికీ తప్పే. మద్యం మత్తులో వున్నాడని ప్రభుత్వమే చెబుతోంది.. పైగా, మానసిక స్థితి సరిగ్గా లేదని కూడా ప్రభుత్వమే చెబుతోంది.

ఈ లెక్కన, సుధాకర్‌ అనే వ్యక్తి డాక్టర్‌ కావొచ్చు.. సాధారణ వ్యక్తి కావొచ్చు.. అతనిపై పోలీసుల దాడి అమానుషం. కాళ్ళు, చేతులు కట్టేసి.. రోడ్డు మీద పడుకోబెట్టి.. అత్యంత హేయమైన చర్య ఇది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. దళితుడనే కాదు.. ఏ వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎదురైనా అది క్షమార్హం కాదు. పైగా, అది పోలీసుల సమక్షంలో జరగడం ఇంకా దారుణం.

సోషల్‌ మీడియాలో డాక్టర్‌ సుధాకర్‌కి సంబంధించి పలు వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిని పట్టుకుని, ఇలాంటి వ్యక్తిని సమర్థించడమా.? అని అధికార పార్టీ మద్దతుదారులు అంటున్నారు. కానీ, అసలు రాష్ట్రంలో మద్యం షాపులు ఎందుకు తెరిచినట్లు.? అన్న చర్చ తెరపైకొస్తోంది. అసలు మద్యమే అందుబాటులో లేకపోతే ఇలా జరిగేదా.! అన్న వాదనకి ప్రభుత్వం సమాధానం చెప్పగలదా.?

పైగా, మానసిక సమస్యతో డాక్టర్‌ సుధాకర్‌ బాధపడుతున్నట్లు ప్రభుత్వంలో వున్నవారే ‘సర్టిఫై’ చేశాక, ఆయన మీద జరిగిన దాష్టీకానికి ప్రభుత్వం ఎలా సమాధానం చెప్పుకోగలుగుతుంది.? మళ్ళీ ఈ ఎపిసోడ్‌లోనూ విశాఖ పోలీసులే కార్నర్‌ అయ్యారు. అధికార పార్టీ చేతుల్లో పావులుగా మారి, ప్రజల్ని రాచి రంపాన పెడుతున్నారనే విమర్శలు సోషల్‌ మీడియా వేదికగా వెల్లువెత్తుతుండడం గమనార్హం.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: ప్రియుడిని చంపి తాను చావాలనుకుంది

గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్‌ కుమార్‌, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్‌ కుమార్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు....

నా సినిమా బాహుబలి 2 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం దాదాపుగా రెండు వేల కోట్లను వసూళ్లు చేసిన విషయం తెల్సిందే. వందేళ్ల సినీ చరిత్రలో ఆ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా లేదనే...

ఒక్క పూట భోజనం కోసం 24 కి.మీ కాలి నడక ప్రయాణం

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం, ఉప్పాడకు చెందిన పెంకే రామకృష్ణ కుటుంబం గతంలో మంచి ఆస్తుపరులు. ఆయన తోబుట్టువులు మరియు ఇతర కుటుంబ సభ్యులు బాగానే సెటిల్‌ అయ్యారు. కాని రామకృష్ణ...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...

బర్త్ డే స్పెషల్‌: అన్నగారు, మరో నూరేళ్లయినా సరిలేరు మీకెవ్వరు.!

తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులు అద్దినది.. తెలుగు సినిమాకు కొత్త పంథా నేర్పించింది.. తెలుగు వారి ఆత్మ గౌరవంను కాపాడినది.. తెలుగు వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించి పెట్టింది.. తెలుగు భాషను...