Switch to English

మూడు రాజధానులపై ‘మోజు’ తీరలేదింకా.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు.. మూడు రాజధానుల విషయంలో. రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం, రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్ని బాగు చేయలేని దుస్థితి ఓ వైపు కనిపిస్తోంటే, ఇంకో వైపు మూడు రాజధానులు కట్టి తీరతామంటోంది వైసీపీ.

ఎలా.? అదెలా.? సాధ్యమయ్యేదెలా.? అంటూ వైసీపీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నా, అధికార పార్టీ నేతల తీరు మూడు రాజధానుల విషయంలో మాత్రం రోజురోజుకీ మరింత హాస్యాస్పదంగా మారిపోతూనే వుంది. సీరియస్‌గా ప్రకటనలు ఇచ్చేస్తున్నామని వైసీపీ నేతలు అనుకోవచ్చుగాక, కానీ అది బీభత్సమైన కామెడీ అయిపోతోంది.

ఇటీవలే వైఎస్ జగన్ ప్రభుత్వం, మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. అయితే, మూడు రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడంలేదనీ, మరోమారు మెరుగైన బిల్లుతో వస్తామనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

మెరుగైన బిల్లు అంటే ఏంటి.? రాష్ట్రానికి మూడు కాకపోతే, ముప్ఫయ్ మూడు రాజధానులు పెట్టుకోవచ్చు. కానీ, మొదటి అడుగు అంటూ పడాలి కదా.? అదీ మొదటి రాజదానితో మొదలవ్వాలి కదా.? ఆ మొదటి రాజధాని అమరావతి అయినప్పుడు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించకుండా మూడు రాజధానులెలా సాధ్యం.?

అమరావతిని స్మశానమన్నారు, ఎడారి అన్నారు.. దాన్నే శాసన రాజధాని అంటున్నారు. ఇక్కడే అధికార పార్టీకి.. అందునా వైఎస్ జగన్ ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఎడారి అలియాస్ స్మశానం అనబడే అమరావతిలో శాసన రాజధాని అనడంతోనే వైఎస్ జగన్ ప్రభుత్వం తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంటోంది.

తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మూడు రాజధానుల కోసం కొత్త బిల్లుని మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెడతామని చెప్పారు. బిల్లు పెట్టొచ్చుగాక.. చట్టం చేయొచ్చుగాక.. కానీ, అది న్యాయ సమీక్ష ముందు నిలబడుతుందా.? అన్నదే అసలు ప్రశ్న.

రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు న్యాయం జరగకుండా రాజధానిని కదిలించే పరిస్థితి లేదు.. రాజధాని లేదా రాజధానుల పేరుతో వైసీపీ సర్కార్ ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు చేసినా ఉపయోగం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో...

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

రాజకీయం

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పెద్దగా కాదు.. బిడ్డగానే...

మాజీ మంత్రి శంకర్రావును దోషిగా తేల్చిన కోర్టు

మాజీ మంత్రి శంకరరావుపై నమోదైన మూడు కేసుల్లో రెండు కేసుల్లో దోషిగా తేలుస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు శంకర్రావును దోషిగా ప్రకటించడంతో ఆయన కోర్టు హాల్లోనే పడిపోయారు. దీంతో వెంటనే...

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

ఎక్కువ చదివినవి

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ రెండు సినిమాలకు కమిట్ అయి ఉన్న...

ఏపీ సర్కారు సంక్రాంతి దోపిడీ: సామాన్యుల్ని ఉద్ధరించడానికే.!

పండగ పేరు చెప్పి ప్రయాణీకుల్ని దోచేయడాన్ని ఏ తరహా ‘జనోద్ధరణ పథకం’ అనుకోవాలి.? సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వైఎస్...

విషాదం: మునేరు వాగులో గల్లంతైన చిన్నారులు మృత్యువాత

సరదాగా గడపాల్సిన సంక్రాంతి పండుగ సెలవులు ఆ చిన్నారులను మృత్యు తీరాలకు చేర్చాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులోని మునేరు వాగులో విద్యార్ధుల గల్లంతు ఘటన విషాదమైంది. ఈత కొట్టేందుకు వెళ్లిన...

తెలుగుదేశం పార్టీ.. తేనె పూసిన కత్తి.. ఇదిగో సాక్ష్యం.!

ఓ వైపు ప్రేమ బాణాలు సంధిస్తున్నారు.. ఇంకో వైపు ‘కుత్తుక’ కోసేందుకు కత్తికి పదును పెడుతున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు.! 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుని కోరింది తెలుగుదేశం పార్టీ. 2019...

రండి.. కోవిడ్ వైరస్ అంటించుకోండి.! ఇదెక్కడి బాధ్యతారాహిత్యం.?

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయ్.. ఐదు వేలకు దిగువకు దేశంలో రోజువారీ కేసులు దిగివస్తున్న వేళ, అనూహ్యంగా కేసుల తీవ్రత పెరిగిపోయి.. లక్షన్నరకి చేరుకుంది. నాలుగైదు లక్షలకు రోజువారీ కేసులు చేరడానికి జస్ట్...