Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఇవి వైసీపీ సర్కారు వైఫల్యాలు కావా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? ఈ ప్రశ్నకు సమాధానం, ‘ప్రస్తుతానికైతే అమరావతి’ అని. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది.? గతంలో అయితే 2021 జూన్, మొన్నటిదాకా 2021 డిసెంబర్.. ఇప్పుడేమో డేట్ తెలియదు అనే సమాధానం.!

మూడు రాజధానుల సంగతేంటి.? అని ప్రశ్నిస్తే, ‘ప్రస్తుతానికి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నాం, త్వరలో మరింత మెరుగైన బిల్లుని చట్టసభల్లో ప్రవేశపెట్టి, ఆమోదింపజేస్తాం..’ అని సమాధానం వస్తోంది.

శాసన మండలి సంగతేంటి.? గతంలో శాసన మండలిని వ్యతిరేకించారట, ఇప్పడు శాసన మండలిని కొనసాగించడానికే నిర్ణయం తీసుకున్నారట.

పార్టీ ఫిరాయించిన వ్యక్తికి వెంటనే, పదవి పోవాలన్నారు కదా.? అప్పట్లో అలా అన్నారుగానీ, ఇప్పుడు ఆలోచనా విధానం మార్చుకున్నారట..

బోల్డన్ని ప్రశ్నలున్నాయి.. సమాధానాలు వెతికితే, అన్నటికీ ‘యూటర్న్’ సమాధానాలే వస్తాయి. ప్రత్యేక హోదా కావొచ్చు, మరో విషయం కావొచ్చు. దేంట్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ స్పష్టత అంటూ లేకుండా పోయింది. దీన్ని పరిపాలన అనాలా.? ఇంకేమన్నా అనాలా.?

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు సహా, చాలా విషయాల్లో న్యాయస్థానాల నుంచి మొట్టికాయల మీద మొట్టికాయలు పడుతూనే వున్నాయి. వీటిని ప్రభుత్వ వైఫల్యాలు అని కాక ఇంకేమనాలి.? రోజులు గడుస్తున్నాయ్.. నెలలు గడుస్తున్నాయ్.. ఏళ్ళు కూడా గడుస్తున్నాయ్.. కానీ, వైఫల్యాల సంఖ్య పెరుగుతోంది తప్ప, ఆ వైఫల్యాల్ని సరిదిద్దుకుని మెరుగైన పాలన అందించాలన్న ఆలోచనే కనిపించడంలేదు.

ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవడం కాదు.. ఏకంగా ప్రాజెక్టులు కొట్టుకుపోయేదాకా వచ్చింది పరిస్థితి. ‘మేం అధికారంలోకి వచ్చాం కాబట్టి, మంచి మంచి వర్షాలు కురుస్తున్నాయ్..’ అని చెప్పుకుంటున్న పాలకులు, ‘ఆ వర్షాల వల్లనే.. అంటే, మా పాలన వల్లనే ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయ్..’ అని మాత్రం చెప్పుకోలేరు.

రెండున్నరేళ్ళకే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారైతే, ఇంకో రెండున్నరేళ్ళలో రాష్ట్రం ఏమైపోతుంది.? ఇంకేమవుతుంది.. అప్పులు డబుల్ అవుతాయ్.. రాష్ట్రం భ్రష్టుపట్టిపోతుంది. అంతే కదా.? కాకపోతే, బూతుల మంత్రుల నుంచి మరిన్ని బూతులొస్తాయ్.. బూతులే అసలు సిసలు సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం అనే స్థాయికి కొత్త డిక్షనరీలు తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...