Switch to English

పాలన చేతకాక జనం గొంతు నొక్కడమేంటి.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా విభాగం ఎంత గొప్పగా పనిచేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడంలో వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఎప్పుడో మాస్టర్‌ డిగ్రీ సంపాదించేసింది. ‘ఎవరో సామాన్యులు కడుపు మండి తమ అభిప్రాయాల్ని సోషల్‌ మీడియాలో వ్యక్తం చేస్తే.. వారిపై ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు దిగడమా.? అరెస్టులు చేయడమా.?’ అంటూ అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌, అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

వైఎస్‌ జగన్‌ ఒక్కరే కాదు, విజయసాయిరెడ్డి సహా వైసీపీ ముఖ్య నేతలందరిదీ అదే తీరు. ‘మీడియా ఎలాగూ చచ్చిపోయింది.. సోషల్‌ మీడియాలో అయినా ప్రజలు తమ అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పనివ్వండి..’ అని వైసీపీ నినదించింది. ఇప్పుడు అదే వైసీపీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ‘మాట మార్చడం, మడమ తిప్పడం’లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న వైఎస్‌ జగన్‌, ఇప్పుడు సోషల్‌ మీడియా ‘గొంతు కోసేందుకు’ ప్రయత్నిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టినా అరెస్ట్‌ తప్పదన్న సంకేతాల్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పంపిస్తోంది. అయినా, సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ పోస్ట్‌ వచ్చిన వెంటనే.. దానిపై దుమ్మెత్తిపోసేందుకు వైసీపీ సోషల్‌ మీడియా విభాగం అలర్ట్‌గానే వుంటుంది కదా.!

జుగుప్సాకరమైన రాతలు, అసభ్యకరమైన వ్యక్తిగత దూషణలకు శిక్ష పడాల్సిందే. సోషల్‌ మీడియా ఇందుకు మినహాయింపేమీ కాదు. మరి, అదే పని చేస్తోన్న వైసీపీ నేతల మాటేమిటి.? మంత్రులేకాదు, స్పీకర్‌ కూడా విచ్చలవిడిగా విపక్షాలపై బూతులు మాట్లాడేస్తున్న రోజులివి. చర్యలు తీసుకోవాల్సి వస్తే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుగా తమ పార్టీ నుంచే ప్రారంభించాలి. అలా చేయగలిగితే వైఎస్‌ జగన్‌కి ఎవరైనా సెల్యూట్‌ చెయ్యాల్సిందే.

‘పాలన చేతకాక జనం గొంతు నొక్కుతున్నారు..’ అనే అపప్రధ చంద్రబాబు మూటగట్టుకున్నారు.. అదే పని వైఎస్‌ జగన్‌ చేస్తోంటే, ‘ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే’ అని కాక ఇంకేమని అనాలి.?

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

హైకోర్టులో షాకుల మీద షాకులు.. ఎందుకిలా?

ఏపీ సర్కారుకు హైకోర్టులో షాకుల మీదు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ ఇన్ని ఎదురుదెబ్బలు తగల్లేదనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. జగన్ అధికారం చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ బాగా పెరిగింది. వరసగా టాలీవుడ్ లో...

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూసాక స్పందిస్తా: మంత్రి తలసాని

సినీ పరిశ్రమ గురించి ప్రముఖులతో జరిగిన చర్చలపై బాలకృష్ణ వ్యాఖ్యలను చూశాక స్పందిస్తానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. షూటింగ్స్ పునఃప్రారంభించే విషయమై సినిమా, టీవీ...

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

‘సమంత’ ఏమంత అందగత్తె కాదు.. బుట్టబొమ్మకు షాకిచ్చిన హ్యాకర్లు

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ కు గురయ్యింది. టెక్నికల్ టీం సాయంతో మరలా ఆ అకౌంట్ ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని అర్ధరాత్రి 12.37 గంటలకు ట్విటర్ వేదికగా నెటిజన్లకు...