Switch to English

వడ్డించేవాడు మనవాడైతే.! వైసీపీ వాలంటీర్ల సాక్షిగా ఐదు కోట్ల దోపిడీ.!

‘వాలంటీర్ పోస్టులు ఎవరికి ఇచ్చుకున్నాం.? వైసీపీ కార్యకర్తలకే కదా.? వాళ్ళెవరైనా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే, పీకి పారెయ్యండి..’ ఇది తాజాగా ఓ మంత్రిగారు సెలవిచ్చిన వైనం.

కొన్నాళ్ళ క్రితం, ‘వాలంటీర్ పోస్టులన్నీ మన పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నాం..’ అని వైసీపీకి చెందిన ఓ కీలక నేత ప్రకటించేసుకున్నారు. సదరు మంత్రిగారి పేరు అంబటి రాంబాబు అయితే.. సదరు కీలక నేతగారి పేరు విజయసాయిరెడ్డి.

సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని స్పష్టమయిపోయిందన్నమాట. ఆ వాలంటీర్లకు గౌరవ వేతనం అందుతోంది. అంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన దరిమిలా, వైసీపీ కార్యకర్తలకు ‘వాలంటీర్లు’ అనే ముసుగు వేసి, ప్రజా ధనాన్ని నెలనెలా దోచిపెడుతున్నట్టే కదా.?

ఇది చాలదన్నట్టు, వాలంటీర్లకు ప్రతి నెలా న్యూస్ పేపర్ ఖర్చు కింద రెండు వందల రూపాయలు చెల్లించే దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి. రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లున్నారు. వాళ్ళందరికీ ‘ప్రముఖ దినపత్రిక’ కొనుక్కునేందుకు ఈ రెండొందల రూపాయలు ఇస్తారట.

వైసీపీ దృష్టిలో, వైసీపీ ప్రభుత్వ దృష్టిలో ప్రముఖ పత్రిక అంటే అది సాక్షి మాత్రమే. సాక్షి పత్రిక కొనుక్కోవడానికి ఇస్తోన్న ఆ సొమ్ములు మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుంచే వెళతాయి. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లయినప్పుడు వాళ్ళకి జీతాలెందుకు.? వైసీపీ కార్యకర్తలే అయినప్పుడు, వాళ్ళకి సాక్షి పత్రిక కొనుక్కునేందుకు డబ్బులెందుకు.?

పైగా, ఇదంతా వైసీపీ పార్టీ సొమ్ములతో చేస్తున్నదైతే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, ప్రజాధనాన్ని వైసీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారు. వాలంటీర్లకు సాక్షి పత్రిక నెల నెలా ఇవ్వడమంటే.. సాక్షి పత్రిక సర్క్యులేషన్, ప్రభుత్వ ఖర్చుతో పెంచుతున్నారనే కదా అర్థం.?

వడ్డించేవాడు మనవాడైతే.. అన్న సామెత ఇక్కడ సరిగ్గా సూటవుతుంది. టీడీపీ హయాంలో టీడీపీ అనుకూల మీడియా లాభపడింది గనుక, వైసీపీ హయాంలో వైసీపీ అనుకూల మీడియా బాగుపడొద్దూ.? ఇంతకీ, ప్రజలెప్పుడు బాగుపడతారు.? ఆ ఒక్కటీ అడక్కూడదు.! ఎందుకంటే, ఓటర్లను కొనేసి కదా, అధికారంలోకి వచ్చేది ఎవరైనాగానీ.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన...

సినిమాల్లో రెగ్యులర్ గా చేసే మాస్, క్లాస్, ఫ్యామిలీ, లవ్, హార్రర్, యాక్షన్, భక్తి, సంగీతం.. సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తే...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: మహేశ్-పూరి కాంబోలో టాలీవుడ్ గేమ్ చేంజర్...

బాల నటుడిగా నిరూపించుకున్న మహేశ్ బాబు పూర్తిస్థాయి హీరోగా ఫుల్ ఛార్మింగ్ లుక్, రొమాంటిక్, పాల బుగ్గల మేని ఛాయతో తెలుగు సినిమాకు గ్లామర్ తీసుకొచ్చారు....

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: స్లో డ్యాన్సులతో ట్రెండ్ సెట్ చేసిన...

ఎప్పుడైతే చిరంజీవి స్పీడ్ ఫైట్లు, బ్రేక్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదం అందించారో ప్రేక్షకులు ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఆశిస్తూనే...

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల...

ఇదీ బాస్ అంటే.. ఇదీ వ్యక్తిత్వం అంటే.. అందుకే ఆయన మెగాస్టార్..

నిన్న బింబిసార సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ వచ్చిన విషయం అందరికీ సంతోషం కలిగించింది.. కానీ ఎక్కడి నుంచి వస్తారో ఫాన్స్ పేరుతో కొందరు...

రాజకీయం

వైఎస్ జగన్ సమర్థతకి గోరంట్ల మాధవ్ సవాల్.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థతకి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారా.? ఈ చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. కొన్నాళ్ళ...

ఏపీలో టీడీపీ పరిస్థితే తెలంగాణలో టీఆర్ఎస్‌కి వస్తుందా.?

2014 నుంచి 2018 వరకు టీడీపీ - బీజేపీ కలిసే వున్నాయ్. 2018 నుంచి కథ మొదలైంది. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నినదించడం మొదలు పెట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది....

గోరంట్ల మాధవ్‌ని వెనకేసుకొచ్చిన మంత్రి రోజా.!

అరరె.! ఎంత మాట అనేస్తిరి.? నేరం నిరూపితం కాకుండానే అనవసరమైన ఆరోపణలు చేయడమేంటి.? అంటూ మంత్రి రోజా ‘సుద్ద పూస కబుర్లు’ చెబుతున్నారు. ఏంటో, ఈ రాజకీయం.! ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం...

మోడీ, బాబు కలయిక.! వాళ్ళకి హ్యాపీ, వీళ్ళకి బీపీ.!

ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఎదురు పడితే కులాసాగా కబుర్లు చెప్పుకోవడం కొత్తేమీ కాదు. రాజకీయంగా ఇద్దరి మధ్యా ఎన్ని విభేదాలు వున్నాగానీ.. తప్పవు.. కాస్సేపు నటించాల్సిందే.! అయినా, నటించాల్సిన అవసరమేముంటుంది.? వ్యక్తిగత వైరాలు...

అంతేనా.? గోరంట్ల మాధవ్ మీద ‘వేటు’ పడే అవకాశమే లేదా.?

అదేంటీ, గోరంట్ల మాధవ్ మీద వేటు పడుతుందనే ప్రచారం వైసీపీనే చేసింది కదా.? ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేటీఎం కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు కదా.? కఠిన...

ఎక్కువ చదివినవి

ఈ సీత టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్ సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో...

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు దారుణం : ఈటెల

గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లు అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం కన్ఫర్మ్‌ అయ్యింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే...

వైఎస్ జగన్ సమర్థతకి గోరంట్ల మాధవ్ సవాల్.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థతకి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారా.? ఈ చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. కొన్నాళ్ళ...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: స్లో డ్యాన్సులతో ట్రెండ్ సెట్ చేసిన చిరంజీవి ‘కొండవీటి దొంగ’

ఎప్పుడైతే చిరంజీవి స్పీడ్ ఫైట్లు, బ్రేక్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదం అందించారో ప్రేక్షకులు ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఆశిస్తూనే ఉన్నారు. దశాబ్దాలుగా ఇప్పటికీ అదే కొనసాగుతోంది....

ఏపీలో టీడీపీ పరిస్థితే తెలంగాణలో టీఆర్ఎస్‌కి వస్తుందా.?

2014 నుంచి 2018 వరకు టీడీపీ - బీజేపీ కలిసే వున్నాయ్. 2018 నుంచి కథ మొదలైంది. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నినదించడం మొదలు పెట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది....