Switch to English

మండలిపై పట్టు సాధించిన వైసీపీ: మండలి రద్దు హుళక్కేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

శాసన మండలి రద్దు.. అనేది ఆవేశంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కానే కాదంటూ కొన్నాళ్ళ క్రితం శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, అధికార పార్టీకి చెందిన శాసన సభ్యులు సెలవిచ్చారు. శాసన మండలి నిర్వహణ అనేది ఖర్చు దండగ వ్యవహారంగా వైసీపీ పేర్కొంది. అందుకే, శాసన మండలిని రద్దు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శాసన సభలో శాసన మండలి రద్దుపై తీర్మానం కూడా చేసిన వైసీపీ ప్రభుత్వం, ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది.

అప్పట్లో శాసన మండలి రద్దుకి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం వుంది. అదే, శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకోలేకపోవడం. సంఖ్యా పరంగా చూసుకుంటే అప్పటికి శాసన మండలిలో వైసీపీ కంటే టీడీపీ బలమైన స్థానంలో వుంది. అదే వైసీపీకి కంటగింపుగా మారింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. శాసన మండలిలో టీడీపీ బలం తగ్గి, వైసీపీ బలం పెరిగింది. దాంతో, ఇకపై శాసన మండలిలో వైసీపీకి ఎలాంటి సమస్యలూ వుండకపోవచ్చు.

నిజానికి, రాష్ట్ర స్థాయిలో శాసన మండలి, జాతీయ స్థాయిలో రాజ్యసభ.. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం.. అన్న విమర్శలున్నాయి. నిజానికి రాజ్యసభ పరిస్థితి వేరు. రాష్ట్రాల స్థాయిలో శాసన మండలిని మరీ పాతాళానికి దిగజార్చేశారు.. గౌరవం పరంగా.. అన్ని రాజకీయ పార్టీలకూ ఈ పైత్యంలో వాటా వుంది. అందుకే, దేశంలో కొన్ని రాష్ట్రాలు శాసన మండలిని కలిగి లేవు.. శాసన మండలి పెట్టాలన్న ఆలోచన కూడా ఆ రాష్ట్రాల్లో లేవు.

ఇక, ఇప్పుడు ఏం జరగబోతోంది.? కేంద్రం వద్ద పెండింగులో వున్న శాసన మండలి రద్దు అంశం గనుక ముందుకు కదిలితే, వైసీపీ పరిస్థితేంటి.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. సమయం చూసి వైసీపీని దెబ్బ కొట్టాలనుకుంటే, బీజేపీకి అది చిటికెలో పని. అలా చేస్తే, రాజకీయంగా వైసీపీ చాలా గట్టి దెబ్బ తినేయాల్సి వస్తుంది. కానీ, అప్పట్లో ఆవేశంతో రద్దుపై నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్, ఆ తర్వాత ఆలోచన మార్చుకుందనీ, అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు పెట్టడం జరిగిందనీ.. శాసన మండలి రద్దయ్యే అవకాశం లేదనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...