Switch to English

గెలిచిన ఏబీవీ.! వీగిపోయిన వైసీపీ అహం.!

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనీయర్ ఐపీఎస్ అధికారి మీద వైసీపీ అధికారంలోకి వస్తూనే సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఏకంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఏబీవీ వ్యవహరించారనీ వైసీపీ ఆరోపణలు చేయడమే కాదు, వైసీపీ ప్రభుత్వం ఈ మేరకు శాఖాపరమైన చర్యలూ చేపట్టింది.

తన సస్పెన్షన్‌పై న్యాయ పోరాటం చేసి, ఎట్టకేలకు విజయం సాధించారు ఏబీ వెంకటేశ్వరరావు. సర్వోన్నత న్యాయస్థానం ఏబీవీ సస్పెన్షన్‌ని ఎత్తివేయడంతో, ఆయన తిరిగి తనను విధుల్లో చేర్చుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించారు.

పలుమార్లు ఏబీవీ, ఏపీ సచివాలయానికి వెళ్ళినా, అక్కడ ఆయనకు చేదు అనుభవమే ఎదురయ్యిందంటూ వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా.. ఆ వైసీపీ అనుకూల మీడియాకే షాకిస్తూ, వైసీపీ ప్రభుత్వం ఏబీవీని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులూ విడుదలయ్యాయి.

అయితే, ప్రస్తుతానికి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకి సూచించింది. సో, ఆయన తిరిగి విధుల్లో చేరినట్లే భావించాలేమో. ఈ మొత్తం వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు విజయం సాధిస్తే, వైసీపీ అహం వీగిపోయిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

కాగా, తన మీద దుష్ప్రచారం చేసినవారెవర్నీ వదిలి పెట్టేది లేదంటూ గతంలో ఏబీ వెంకటేశ్వరరావు ఢిల్లీ వేదికగా శపథం చేసిన విషయం విదితమే. తిరిగి విధుల్లో చేరితే, ఆయనకు ఎలాంటి అధికారాలుంటాయి.? ఎవర్నీ వదిలి పెట్టేది లేదన్న ఏబీవీ, ఆయా వ్యక్తులపై శాఖాపరంగా ఏమైనా చర్యలు తీసుకోగలుగుతారా.? వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘హ్యాపీ బర్త్ డే’లో పాత్రలన్నీ హీరోలే.. సర్రియల్ కామెడీ సినిమా: లావణ్య...

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". రవిశంకర్ యలమంచిలి సమర్పణలో క్లాప్...

‘ది వారియర్’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. కథ విని ఎగ్జైట్ అయ్యా: కృతి...

యువ హీరో రామ్ పోతినేని ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి...

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేసిన “రామన్న యూత్” ఫస్ట్ లుక్

"జార్జ్ రెడ్డి" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్ బేతిగంటి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను...

సినీ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ సినీ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఇటివల వయసు సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన...

బింబిసార ట్రైలర్‌.. మ్యాటర్ ఉన్న సినిమా

తెలుగు సినిమాల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెంచేస్తున్నారు. గ్రాఫిక్స్‌ వర్క్‌ తో బాహుబలి ని...

రాజకీయం

నరేంద్ర మోడీ, కేసీయార్, వైఎస్ జగన్.! ఎవరెలా.? ఎవరికేంటి.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...

‘రైలు తగులబెట్టి నన్ను చంపాలని చూశారు..’ ఎంపీ రఘురామ ఆరోపణ

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైలులో భీమవరం వెళ్తున్న తనను ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో చంపేందుకు కుట్ర పన్నారని.. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు...

జగనన్న విద్యా కానుక: పేదరికం పోవాలంటే చదువే మార్గం: సీఎం జగన్

పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని.. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో విద్యార్ధులకు కిట్లను పంపిణీ...

మురుగు కాల్వలో దిగి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలోని మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగు కాల్వలో...

మెగాస్టార్ చిరంజీవిపై బులుగు పచ్చ అసహనం.!

మెగాస్టార్ చిరంజీవి చేసిన నేరమేంటి.? వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా.. అదేనండీ, బులుగు మీడియా.. అలాగే పచ్చ మీడియా.. ఎందుకు చిరంజీవి మీద విషం చిమ్ముతున్నట్టు.? ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న...

ఎక్కువ చదివినవి

కేసీఆర్‌, మోడీ స్నేహంకు ఇదే సాక్ష్యం : రేవంత్‌ రెడ్డి

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు ఎత్తక పోవడం పట్ల ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ఎందుకు కేసీఆర్‌ ను టార్గెట్‌...

‘ది వారియర్’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. కథ విని ఎగ్జైట్ అయ్యా: కృతి శెట్టి

యువ హీరో రామ్ పోతినేని ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. పవన్...

ఏపీఎస్ఆర్టీసీ: ప్రయాణికులపై మరోసారి చార్జీల బాదుడు

రెండున్నర నెలల్లోనే ఏపీఎస్ఆర్టీసీ మరోసారి బస్సు చార్జీలు పెంచింది. పెంచిన టికెట్ ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లోకి వస్తాయి. ఏప్రిల్ 14న డీజిల్ సెస్ పేరుతో చార్జీలు పెంచి.. ఇప్పుడూ అదే పేరుతో...

కట్టప్ప తనయుడికి బాహుబలి సపోర్ట్‌..!

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా కూడా తన అవసరం ఉన్న చిన్న సినిమాలకు కూడా మాట సాయం చేస్తాడు.. లేదంటే కనీసం సోషల్ మీడియాలో పోస్ట్...

లండన్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి

నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి. ఏడాదిన్నర క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే...