గోవుల మరణాలపై వైసీపీ కట్టుకథలు.. అసలు వాస్తవాలు ఇవే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

టీటీడీకి చెందిన ఎస్ వి గోశాలపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సడెన్ ఏపీ రాజకీయాల్లోకి ఈ గోశాలను తీసుకురావడం వెనక వైసీపీ కుట్ర దాగి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం జగన్ ను సనాతన ధర్మ పరిరక్షకుడు అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చేస్తోంది. గోశాలలో 100 గోవులు చనిపోయాయని.. కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. అపచారం అంటూ నానా హైరానా చేస్తోంది. ఫేక్ ప్రచారాలతో వైసీపీ కొత్త సింపతీ డ్రామాలకు తెర తీసింది. ఇదంతా చేయడానికి అసలు కారణం వేరే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయింది.

అందులో భాగంగానే గోశాలలపై విజిలెన్స్ నివేదిక రెడీ చేస్తోంది. ఈ నివేదికలో వైసీపీ హయాంలో జరిగిన అనేక అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సస్పెండ్ అయిన మాజీ గోశాల అధికారి హరినాథ్ రెడ్డికి సమాచారం వెళ్లింది. అతను ఈ విషయాన్ని మాజీ టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డికి చేరవేశారు. తమ అక్రమాలు ఎక్కడ బయటపడుతాయో అనే భయంతో వైసీపీ గోవుల మరణాలు అనే విషయాన్ని తెరమీదకు తెచ్చింది. తమ మీద నింద పడకముందే కూటమి మీద బురద జల్లితే ఎఫెక్ట్ పెద్దగా ఉండదని భావించారు కాబోలు. అందుకే హరినాథ్ రెడ్డి ఇచ్చిన అచ్చీరాని సమాచారంతో భూమన కరణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ గోశాలలో 100 గోవులు చనిపోయాయి అంటూ సంచలనానికి తెరతీశాడు.

అక్కడి నుంచే ఈ వివాదం ముదురుతోంది. దీన్ని టీటీడీ అధ్యక్షుడు బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. అలాంటిదేం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని భూమనపై ఆయన విరుచుకుపడ్డారు. హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే ముందుగానే గోశాలపై ఆరోపణలు ప్రారంభించారు. వైసీపీ హయాంలో టీటీడీ గోసంరక్షణ శాలల్లో జరిగిన ఘోరాలు అన్నీఇన్నీ కావు. అప్పట్లో వారి హయాంలో గోవులు కుప్పలు, తెప్పలుగా చనిపోతే పట్టించుకోలేదు. చనిపోయిన వాటిని నిర్ధాక్షిణ్యంగా చెత్తబుట్టల్లో పడేశారు. నాసీరకం దాణాలు పెట్టి మూగజీవాల ప్రాణాలు తీశారు. ఇలా వందలాది గోవులు చనిపోయినా దాన్ని బయటకు రానివ్వకుండా అప్పటి అధికారి హరినాథ్ రెడ్డి మేనేజ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ హయాంలో ఏప్రిల్‌, 2022 – జనవరి 2023 మధ్య ఎస్వీ గోశాలలో 27, పలమనేరు గోశాలలో 26, కమలయ్యగారిపల్లి గోశాలలో 7.. మొత్తం 60 ఆవులు, దూడలు చనిపోతే వాటిని కప్పిపుచ్చారని విజిలెన్స్ లో తేలింది. వైసీపీ హయాంలో గోశాలల నిర్వహణ అధ్వానంగా ఉండేది. సరైన పరిశుభ్రత పాటించలేదు. గోవులకు అనారోగ్యం వచ్చినా చికిత్స చేయించక చాలా వరకు చనిపోయాయి. చివరకు గోవుల దాణాకు పిలిచిన టెండర్లలో కూడా అవినీతి జరిగిందని నివేదిక చెబుతోంది. యర్రావారిపాళెంలో ఆవులు లేకున్నా.. అక్కడకు దాణా టెంటర్లు పిలిచారు హరినాథ్ రెడ్డి. లేని ఆవులకు దాణా పేరుతో రూ. 1.78 కోట్లు చెల్లింపులు జరిగిపోయాయి. అంతే కాకుండా బయో మెన్యూర్‌ని ఎన్‌రిచ్డ్‌ బయోమెన్యూర్‌గా తయారు చేసేందుకు టన్నుకు రూ.7,500 చొప్పున చెల్లించారు.

చాలా సార్లు ఎక్స్ పైర్ అయిపోయిన మందులను గోవులకు వాడారు. 2019-24 మధ్య విజిలెన్స్ తనిఖీల్లో గోశాల అక్రమాలు బట్టబయలైనా, గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఒక్క 2024లోనే 179 ఆవులు చనిపోయినా ప్రభుత్వం బయటకు రానివ్వకుండా తొక్కి పెట్టేసింది. 2021 జులై 22న విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి రూ.78 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ దానిపై వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపించలేదు. అప్పటి టీడీపీ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించి వందలాది గోవుల మరణానికి కారణం అయింది. కానీ ఇప్పుడు కూటమి హయాంలో 2025 జనవరి–మార్చి మధ్య 2,700 గోవుల్లో 43 మాత్రమే చనిపోతే దానిపై వైసీపీ అవకాశ రాజకీయాలు చేస్తోందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు నిర్వహణ మెరుగ్గా ఉందని.. గోవుల మరణాలు ఇప్పుడు తగ్గడమే కాకుండా రోజుకు 450 లీటర్ల పాల ఉత్పత్తిని 762 లీటర్లకు పెంచినట్టు చెబుతున్నారు.

సినిమా

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

“ఇది కేవలం ఆరంభం మాత్రమే…”: ఏపీ ప్రగతిపై లోకేష్ వ్యాఖ్యలు

అమరావతి: గత 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’...

Trisha: హీరోయిన్ ‘త్రిష’కు అవమానం..! కావాలనే చేశారా..!?

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. 2002లో తమిళంలో సూర్యతో వచ్చిన మౌనం పెసియాదే నుంచి నేటి వరకూ ఆమె హీరోయిన్ గా రాణిస్తూనే ఉన్నారు. 24ఏళ్లుగా హీరోయిన్ గా సుదీర్ఘ...

DAILY HOROSCOPE: మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు – కన్య రాశి వారికి పనుల్లో పురోగతి.. ధనుస్సు రాశి వారికి ప్రయాణ లాభాలు

మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...