విజయవాడలో వరదల నేపత్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కోటి రూపాయల విరాళం ప్రకటించింది. అయితే, ఈ విరాళాన్ని ఏ రూపంలో అందించాలన్నదానిపై పార్టీలో చర్చించి, నిర్ణయం వెల్లడించబోతున్నారట.! వినడానికి కామెడీగా లేదూ.! వైసీపీ అంటేనే కామెడీ మరి.!
మామూలుగా అయితే, విపత్తుల నేపథ్యంలో వ్యక్తులైనా, సంస్థలైనా, పార్టీలైనా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సాయం ప్రకటించడం చూస్తుంటాం. చాలా అరుదుగా మాత్రమే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు విరాళాలు ప్రకటిస్తుంటాయ్. ఎందుకు.? అంటే, అదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఇక, వైసీపీ అయితే విరాళాలు ప్రకటించడం అనేది చాలా చాలా చాలా చాలా అరుదైన విషయం.! ఇటీవలే వరద ప్రాంతాల్లో పర్యటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా కోరుతున్న వైసీపీ, వరద బాధితులకు వున్నపళంగా ఏమైనా సాయం చేసిందా.? అంటే, అదీ లేదాయె.!
వైసీపీ నేతలు వరద బాధితులకు సహాయక చర్యలు అందించిన దాఖలు కనిపించడంలేదు. పైగా, ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’ అంటూ కామెడీ చేసి వెళ్ళారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసలు గేట్లే లేని బుడమేరు వాగు గురించి ‘గేట్లు తెరిచేశారు అడ్డగోలుగా’ అంటూ ఇంకో కామెడీ జగన్ చేయడం చూశాం.
ఇప్పుడేమో, వరద బాధితులు కోటి రూపాయల సాయమంటూ వైసీపీ ఇంకో కామెడీ చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం.. అని వైసీపీ ప్రకటించి వుంటే.. బావుండేది నిజానికి.! కానీ, అది వైసీపీ కదా.!
వైసీపీ విధానాలేంటో రాష్ట్ర ప్రజలకి, అందునా వరద ముంపు బాధితులకు అస్సలేమాత్రం అర్థం కావడంలేదు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, వాలంటీర్ల గురించి మాట్లాడిన జగన్, ఇప్పుడేమో సాయం ప్రకటించి, ఏ రూపంలో అందించాలో పార్టీలో చర్చిస్తామని చెప్పడంతో.. రాష్ట్ర ప్రజానీకం జుట్టు పీక్కోవాల్సి వస్తోంది.!