Switch to English

పొలిటికల్‌ వైరస్‌: హెరిటేజ్‌ని మూసెయ్యాల్సిందేనా.!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకి ఓ వైరస్‌ పట్టింది. ఇది కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కంటే చాలా భయంకరమైనది. ప్రజల ప్రాణాలెలా పోయినాసరే.. అక్కడి అధికార పార్టీకి మాత్రం రాజకీయాలే కావాలి. ఎక్కడో తెలంగాణలో హెరిటేజ్‌ సంస్థకు చెందిన ఓ యూనిట్‌లో సెక్యూరిటీ గార్డుకి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే.. ఏకంగా ఆ ‘యూనిట్‌’ని మూసెయ్యాలని డిమాండ్‌ చేసేస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకేముంటుంది.?

ఆ మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో సాక్షాత్తూ రాజ్‌భవన్‌లోనే పలువురికి కరోనా వైరస్‌ సోకింది. నలుగురు రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా సోకినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ‘గురివింద గింజ’ తన ‘కింద’నున్న మచ్చని మర్చిపోయి, ఇతరుల మీద ఎగబడిపోవడమంటే ఇదే మరి.!

ఇంత చెత్త రాజకీయం దేశంలో ఇంకెక్కడా లేకపోవడాన్ని ఎలా అనుకోవాలి.? ఆంధ్రప్రదేశ్‌లో 50కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి ‘కాంటాక్ట్‌’ ఇప్పటిదాకా దొరకలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగారే చెబుతారు. అంటే, ప్రభుత్వం ఎంత దారుణంగా కరోనా వైరస్‌ విషయంలో ఫెయిల్‌ అయ్యిందో ఈ ఒక్క విషయంతోనే అర్థం చేసుకోవచ్చు.

తెలుగుదేశం పార్టీ మీదనో, మరో విపక్షం మీదనో విమర్శలు చేసే సమయంలో పదో వంతు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వుంటే బావుంటుందన్న భావన రాష్ట్ర ప్రజానీకంలోనే కలుగుతోంది. ‘మేం రెండు వైరస్‌లతో పోరాడుతున్నాం.. ఒకటి కరోనా వైరస్‌.. ఇంకోటి అంతకన్నా ప్రమాదకరమైన ఎల్లో వైరస్‌..’ అని మంత్రులు మీడియాకెక్కి నిస్సిగ్గుగా మాట్లాడతారు. ఒకరేమో, ‘చంద్రబాబుకి వయసైపోయింది.. హైద్రాబాద్‌లోనే ఇంట్లోనే వుండాలి..’ అంటారు. ఇంకొకరేమో, ‘చంద్రబాబుకి హైద్రాబాద్‌లో వుండడానికి సిగ్గు లేదా.?’ అని ప్రశ్నిస్తారు.

నిజానికి, ఇలా రాజకీయాలు చేయడానికి అధికార పార్టీ నేతలకే సిగ్గుండాలన్నది రాష్ట్ర ప్రజల భావన. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పేశారు. ఆ పార్టీపై అవాకులు చెవాకులు పేలడం వల్ల వైసీపీనే తన స్థాయిని తగ్గించేసుకుంటుంది. ఇక, హెరిటేజ్‌ విషయానికొస్తే.. చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నది వైసీపీ ఆలోచన. అది ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ప్రక్రియ.

హెరిటేజ్‌ యూనిట్‌లో కరోనా పాజిటివ్‌ తేలాక, అక్కడ ఏం చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ, ఈలోగానే వైఎస్సార్సీపీ నేతలకు ‘దురద’ ఆగడంలేదాయె. ‘మేం అడ్డగోలుగా కరోనా పరీక్షలు చేయడంలేదు..’ అని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పాక కూడా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల్ని ‘అత్యధిక పరీక్షల’ కోణంలో సమర్థించుకుంటున్న వైసీపీ.. నిస్సిగ్గు రాజకీయాలకు ఇకనైనా ఫుల్‌ స్టాప్‌ పెట్టకపోతే.. ప్రజలు తగిన సమయంలో వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయం.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: ఇద్దరు చిన్నారులను కడ తేర్చిన తండ్రి.. తాగిన మత్తులో ఘోరం

ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కర్కశుడయ్యాడు. తండ్రిగా విద్యాబుద్దులు చెప్పించి, పెద్ద చేయాల్సిన బాధ్యతను విస్మరించాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సింది తాగిన మత్తులో కాటికి చేర్చాడు. విషాదకరమైన ఈ...

క్రైమ్ న్యూస్: ప్రియుడిని చంపి తాను చావాలనుకుంది

గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్‌ కుమార్‌, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్‌ కుమార్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు....

గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్, షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం.!

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉండి ఉంటారు....