ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. ‘విరిగింది ఆంజనేయ స్వామి బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అన్నాడొక రాజకీయ నాయకుడు.! అతను వైసీపీకి చెందిన నాయకుడు.! ఇప్పుడైతే రాజకీయాల్లో ఎక్కడా కనిపించడంలేదుగానీ, వైసీపీ హయాంలో ఆయన కీలక నేత. పైగా, మంత్రిగానూ పని చేశారు.!
తెలుసు కదా.. ఆయనెవరో.! ఔను, అతనే కొడాలి నాని. నోరు తెరిస్తే బూతులే.! నీ యమ్మ మొగుడు చెప్పాడా.?’ అంటూ మీడియా ముందర అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించేవారాయన.
ఇప్పుడేమో, విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుని చెరిపేస్తే, అంబేద్కర్ విగ్రహం మీద దాడి.. అంబేద్కర్ మీద దాడి.. రాజ్యాంగం మీదనే దాడి.. దళితుల మీద దాడి.. అంటూ వైసీపీ నేతలు రోడ్డెక్కి నానా రచ్చా చేసేస్తున్నారు.
మరి, ఆంజనేయ స్వామి విగ్రహం మీద జరిగిన దాడి, యావత్ హిందూ సమాజం మీద జరిగిన దాడి కాదా.? భారత దేశం మీద జరిగిన దాడి కాదా.? శ్రీరాముడి విగ్రహాన్ని వైసీపీ హయాంలోనే కొందరు దుండగులు ధ్వంసం చేశారు.. రాములోరి విగ్రహానికి శిరచ్ఛేదం చేశారు. చారిత్రక నేపథ్యం వున్న అంతర్వేది దేవాలయంలో ఏకంగా రధాన్ని తగలబెట్టేశారు వైసీపీ హయాంలోనే.!
దేవాలయాల మీద వైసీపీ హయాంలో ఎంత హేయమైన దాడులు జరిగాయో చూశాం. అప్పుడు పెగలని వైసీపీ నోళ్ళు.. ఇప్పుడెందుకు పెగులుతున్నాయ్.? అయినా, అంబేద్కర్ విగ్రహంపై దాడికి ఎవరైనా ప్రయత్నిస్తారా.? ఆ ఛాన్సే లేదు.
అంబేద్కర్ విగ్రహం కంటే, జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్ఫుటంగా కనిపించేలా వైసీపీ హయాంలో, వికృతమైన ప్రయోగం జరిగింది. అప్పట్లోనే చాలా అభ్యంతరాలూ వచ్చాయి. ఆ పేరు ఇప్పుడు తొలగించబడిందంతే. దీన్ని అంబేద్కర్ మీద దాడి అని వైసీపీ అనడమేంటి.? నలుగురూ నవ్విపోదురుగాక వైసీపీకేటి సిగ్గు.?