వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్.! ఎక్కడన్నా శవం కనిపిస్తే తప్ప, బెంగళూరు నుంచి వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పరిస్థితే లేదని, వైసీపీ శ్రేణులే ఆఫ్ ది రికార్డుగా వాపోతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. ఈ కోవలోనే, పుంగనూరులో ఓ బాలిక చనిపోయిన ఘటన నేపథ్యంలో బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కి వచ్చేందుకు వైఎస్ జగన్ సన్నాహాలు చేసుకున్నారు.
బాలికపై అత్యాచారం చేసి చంపేశారంటూ వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున ప్రచారం చేశాయి. టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినదించారు.. కొందరు ఓ అడుగు ముందుకేసి, ఈ దారుణ హత్యను టీడీపీకి అంటగట్టే ప్రయత్నమూ చేశారు.
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హోంమంత్రి అనిత స్వయంగా రంగంలోకి దిగి, పరిస్థితిని వాకబు చేశారు. బాలికపై అత్యాచారం లేదని అధికారికంగా ప్రకటించారు. తక్కువ సమయంలో నిందితుల్ని గుర్తించి, వారిని పోలీసులు అరెస్ట్ చేసేలా కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతగా వ్యవహరించింది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో తమ డ్రామా బట్టబయలైపోవడంతో ఒక్కసారిగా వైసీపీ సైలెంటయిపోయింది. వైఎస్ జగన్ బెంగళూరు నుంచి, ఏపీకి వచ్చే ‘కార్యక్రమం’ రద్దయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ధృవీకరించారు.
కూటమి ప్రభుత్వం, చిన్నారి హత్య కేసు విషయంలో బాధ్యతాయుతంగా స్పందించింది గనుక, జగన్ పర్యటన రద్దయినట్లు చెప్పారాయన. మరి, చిన్నారిపై అత్యాచారం, హత్య.. అంటూ వైసీపీ ఎందుకు ఫేక్ ప్రచారానికి తెరలేపిందన్నదిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెదవి విప్పలేకపోయారు.
పదకొండు మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న జగన్, కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోతున్నారు. వారంలో ఎక్కువ రోజులు, బెంగళూరుకి పరిమితమవడం.. ఈ తరహా శవ రాజకీయాలు.. వెరసి, వైసీపీ ఉనికి ఆంధ్ర ప్రదేశ్ రానున్న రోజుల్లో ప్రశ్నార్థకం చేసేలా వుంది.