Switch to English

అధికార పక్షమే ఉసిగొల్పితే.. ప్రజలకు దిక్కెవరు.?

రాజకీయాలన్నాక నిరసనలు, ఆందోళనలు సర్వసాధారణమే కావొచ్చుగానీ, కోడిగుడ్లతో దాడి చేయడమేంటి.? టమోటాలు విసరడమేంటి.? అన్నిటికీ మించి, పెట్రోల్‌ బాటిళ్ళు చేత పట్టుకుని ప్రతిపక్ష నేత మీదకు ఎగబడటమేంటి.? ఏదో జరుగుతోంది.! రాజకీయం దారి తప్పుతోంది. రాష్ట్ర రాజకీయాలు ముందు ముందు ఇంకెలా మారతాయోగానీ, ప్రస్తుతానికైతే అత్యంత అధమ స్థాయికి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందన్నది నిర్వివాదాంశం.

అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తే దాన్ని పెయిడ్‌ ఉద్యమం అన్నారు. అదే నిజమైతే, మరి విశాఖ విమానాశ్రయం దగ్గర ఈ రోజు జరిగిందేంటి.? ఇదైతే నిఖార్సుగా పెయిడ్‌ ఆందోళనే. పైగా, అధికార పక్షం అత్యంత వ్యూహాత్మకంగా నడిపిన రాజకీయ నాటకం ఇది. ప్రతిపక్ష నేత మీద అక్కసు అనుకోవాలా.? లేదంటే, ప్రతిపక్ష నేతకు మైలేజ్‌ తెచ్చే క్రమంలో ఈ యాగీ చేశారనుకోవాలా.? కారణం ఏదైతేనేం.. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా దెబ్బ తీసింది. టీడీపీ మాటల్లో చెప్పాలంటే.. రౌడీ రాజకీయాల్ని విశాఖకు తీసుకొచ్చింది అధికార పార్టీ.

విశాఖలో ఇంతకు ముందెన్నడూ ఇంతటి నీఛ రాజకీయాలు చూడలేదని ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటున్నారు. విశాఖను అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌గా కాదు.. పొలిటికల్‌ రౌడీయిజంకి, ఫ్యాక్షన్‌ రాజకీయాలకీ నెలవుగా మార్చుతున్నారనే విమర్శల్ని అధికార పార్టీ ఎదుర్కోవాల్సి వస్తోంది. చంద్రబాబుని అడ్డగించడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తల్లో కసి, కక్ష, కార్పణ్యాలు స్పష్టంగా కన్పించాయి.

చంద్రబాబు మీదకు గుడ్లు, టమోటాలు విసిరే క్రమంలో.. పోలీసులు కూడా ఆ రౌడీ మూకలకు టార్గెట్‌ అవడం గమనార్హం. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, పెయిడ్‌ దీక్షలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అచ్చం అదే బాటలో ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలోనూ పెయిడ్‌ ఉద్యమాలు జరుగుతున్నాయి. అత్యంత హేయంగా రౌడీ మూకల్ని అధికార పార్టీ రంగంలోకి దించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ రోజు జరిగిన సంఘటనలతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ఉలిక్కిపడింది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఆగస్టులో వచ్చే సినిమాలు ఏంటి?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్‌కు అనుమతిస్తూ మెల్ల మెల్లగా లాక్‌ డౌన్‌ను సఢలిస్తున్న విషయం తెల్సిందే. ఆగస్టు నుండి పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం ఉందని.. అయితే సామాజిక దూరం...

6 ఏళ్ల ‘మనం’ జర్నీలో ఆసక్తికర విషయాలు కొన్ని.!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియంది కాదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున దిగ్విజయంగా కొనసాగిస్తే.. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ తో...

లాక్ డౌన్ లో సురక్షితం కాని అబార్షన్లు 10లక్షలు..!

భారత్ లో గర్భం రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇదే వరుసలో అబార్షన్ చేయించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే గర్భం దాల్చకుండా తీసుకునే జాగ్రత్తల్లో...

ఫ్లాష్ న్యూస్: ఆఫ్రికా నుండి ఇండియాకు చేరిన మిడుతల దండు

మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలను అల్లాడించి అతలాకుతలం చేసిన మిడతల దండు పాకిస్తాన్ మీదుగా ఇండియా చేరింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో ఈ మిడతల దండు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట...

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...