Switch to English

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,804FansLike
57,764FollowersFollow

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పిన పరిణామాలతో పాటు 1976లో జలగం వెంగళరావు ప్రభుత్వం ఇచ్చిన జీవో 118, అదే క్రమంలో హైకోర్టు, సుప్రీం కోర్టు కేసులు, తీర్పులు, 2001 లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో చేపట్టిన అవగాహన కార్యమ్రమాల గురించి తెలుసుకోవాలి. కొల్లేరు ప్రాంతంలో ఏర్పడిన సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించాల్సిన అవసరం అందరి మీద ఉందని జనసేన రాజకీయకార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.

10వ కాంటూరు ప్రకారం 2,25,250 ఎకరాలు కొల్లేరు విస్తీర్ణం కాగా.. 5వ కాంటూరు పరిధిలో 77,138 ఎకరాలు వస్తుంది. 1975లో జలగం వెంగళరావు ప్రభుత్వం 7,200 ఎకరాల్లో చెరువులు తవ్వుకొనేందుకు స్థానిక మత్స్యకారులకు అనుమతి ఇచ్చింది. కాలక్రమంలో 70వేల ఎకరాలకు పైగా అక్రమంగా తవ్వేశారు. ఆక్రమణలకు గురైన భూమి 56వేల ఎకరాలకు పైగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

కొల్లేరు పర్యావరణ ధ్వంసం పై హైకోర్టులో నల్లమలై ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. 1999 లో హైకోర్టు వారు కొల్లేరులో ఆక్వా కల్చర్ ఉండకూడదని.. పట్టా భూముల్లో సైతం సంప్రదాయ చేపల వేట, వ్యవసాయం మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొల్లేరు ప్రాంత వాసులకు హైకోర్టు తీర్పుపై అవగాహన, చైతన్యం కలిగించే సదస్సులు నిర్వహించారు. జీవో 120 ఇచ్చి అక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. పర్యావరణాన్ని కాపాడుతూ.. అక్కడ ఉపాది పొందుతున్న మత్స్యకార గ్రామాల ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకున్నారు. ఆ తర్వాత సీఎంగా వచ్చిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ లెక్కలకు అనుగుణంగా 2006లో ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు. కొల్లేరు ప్రాంతంలోని సామాజిక పరిస్థితులను పరిగణించలేదు.

అక్కడ చేపల వేట, చెరువులప ఆధారపడ్డ మత్స్యకార సంబంధిత కులాలను, వృత్తి ఆధారిత కులాల ఆర్ధిక స్థితిగతులను పట్టించుకోలేదు. నాటు బాంబులు ఉపయోగించి చెరువులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ కొల్లేరులో 25,142 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో సామాన్యులభూముల్లో చెరువులను బాంబులతో ధ్వంసం చేశారు. చిత్తశుద్ధితో చేస్తే ఆ తర్వాత అదే ప్రభుత్వంలో వారి అనుచరులు, మరికొన్ని పార్టీల వారు చెరువులపై ఎందుకు బాంబులు వేయలేదు. ఇక్కడ దెబ్బ తిన్నది ఎవరు.. సమస్య ఎలా పీట ముడి పడిందో ఆలోచించాలి.

రాంసార్ కన్వెన్షన్ 2002 ప్రకారం కొల్లేరు ప్రాంతంలో పర్యావరణాన్ని, జీవ వైవిద్యాన్ని పరిరక్షించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. 2017 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొల్లేరు రిహాబిలిటేషన్ పై ఆలోచన చేశారు. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సైతం రాంసార్ కన్వెన్షన్ 2002 ప్రకారం కొల్లేరు పర్యావరణం కాపాడుతూనే అక్కడి ప్రజల జీవనోపాధుల రక్షణ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవడేకర్ తో చర్చించారు.

2019 లో రాష్ట్రంలో పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఏ దశలో కూడా కొల్లేరు ప్రజల జీవనోపాధుల గురించి ఆలోచించలేదు. ఆ పార్టీ అధినేత కొల్లేరుకి పూర్వ వైభవం తెస్తానని ప్రకటనలు చేశారు.

కొల్లేరుకు పూర్వ వైభవం అంటే రాంసార్ కన్వెన్షన్ గుర్తించిన 2,25,000 ఎకరాలకు ఆ సరస్సుని తీసుకురావడమా.. లేదా తండ్రి హాయంలో చేసిన విధంగా నాటు బాంబులతో చెరువులు, భూములు పేల్చడమా అనేది ఆయన స్పష్టత ఇవ్వలేదు. 410 కోట్లతో నాలుగు ప్రత్యేక రెగ్యులేటర్లను నిర్మిస్తామని అన్నారు పైసా కూడా ఇవ్వలేదు. ఆయన సంబంధీకులు మాత్రమే అక్కడ చెవులపై గుత్తాధిపత్యం చేశారు. కొల్లేరు సమస్య సంక్లిష్టం కావడంతో వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు చూస్తే ప్రతి దశలో వారి రాజకీయ అవసరాలకు ఆడిన ఆటలే కారణం కనిపిస్తాయి.

పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతం ఉన్న జనసేన పార్టీ కొల్లేరు వాసులతో వివిధ సందర్భాల్లో ఈ సమస్యపై చర్చించింది. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సమతుల్యమైన పరిష్కారం దిశగా అధికారులు, నిపుణులు, ఆ ప్రాంత వాసులతో చర్చిస్తున్నారు. ఒడిశాలోని చిల్కా సరస్సు విషయంలో కూడా ఇలాంటి చిక్కులే ఎదురైతే అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలను సైతం అధ్యయం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్.

ఎన్నో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించిన అనుభవం సీఎం చంద్రబాబుకి ఉంది. ఆయన నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. కొల్లేరుపై ఆధారపడ్డ వారి జీవనోపాధులను రక్షిస్తూనే, అక్కడి పర్యావరణాన్ని పాకాడే భాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాజకీయ ఎత్తుగడలతో బాంబులతో పేల్చేసినా, పూర్వ వైభవం లాంటి పెద్ద మాటలతో మధ్య పెట్టినా సమస్యను క్లిష్టతరం చేసి కొల్లేరు ప్రజల జీవితాలను ఇక్కట్లలోకి నెట్టింది వైఎస్సార్, ఆయన వారసుడి పాలనే. కూటమి పాలనలో అలాంటి రాజకీయ క్రీడలకు తావు లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొల్లేరు సమస్యలను తీర్చే బాధ్యత ఉందని జనసే రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ప్రకటించారు.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ కు భారీ ఖర్చు..! ఎంతో తెలుసా?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘విశ్వంభర’. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతున్న సినిమాపై అభిమానులు ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడీ సినిమాపై ఓ ఆసక్తికరమైన...

Killer: ‘కిల్లర్’ మూవీలో మత్తెక్కించే స్పై గర్ల్.. లుక్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

Killer: స్పై, థ్రిల్లర్, యాక్షన్ జోనర్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ జోనర్లో ‘శుక్ర, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’.. వంటి డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పూర్వాజ్ స్వీయ...

రామ్, బాలకృష్ణ.. హరీష్ శంకర్ ముందు ఎవరితో..?

మిస్టర్ బచ్చన్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఇంకా టైం పట్టేలా ఉందని...