ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వైఎస్ సునీత దంపతులు కలుసుకున్నారు. ఈ మలుపు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అసలే సునీత ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటున్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును రైస్ చేసింది ఆమెనే. తన తండ్రిని చంపించింది సొంత వాళ్లే అంటూ ఆమె చేసిన ఆరోపణలు.. ముఖ్యంగా అవినాష్ రెడ్డిపై ఆమె చేసిన ఆరోపణలు చాలా వరకు వైసీపీ మీద ప్రభావం చూపించాయి. ఒక రకంగా జగన్ ఓడిపోవడంలో ఆమె పాత్ర కూడా ఉందని చెప్పుకోవాలి.
తన తండ్రి కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలంటూ ఫైట్ చేసిన ఆమె.. ఆ తర్వాత జగన్ ను ఇన్ డైరెక్టుగా టార్గెట్ చేసింది. ఇక ఎన్నికల సమయంలో ఆమె చేసిన ప్రచారాలు, ఆరోపణలు వైసీపీని కుదిపేశాయి. రాయలసీమలో వైసీపీ ఓటు బ్యాంకును భారీగా దెబ్బ తీశాయి. దాంతో సునీత ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా సరే అది హాట్ టాపిక్కే అవుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు సునీత దంపతులు చంద్రబాబును కలుసుకుని.. వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి తమపై అనవసరంగా పోలీస్ కేసు పెట్టాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ విచారించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇక చంద్రబాబు కూడా తనకు అన్నీ తెలుసని.. విచారణ జరిపించి తాను న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాంతో ఇప్పుడు చంద్రబాబు వివేకా హత్య కేసును మరింత సీరియస్ గా తీసుకుంటే అది వైసీపీకి, జగన్ కు ఇబ్బందే అని అప్పుడే ప్రచారం మొదలైంది. జగన్ సొంత చెల్లెళ్లు చంద్రబాబుతో చేతులు కలిపితే ఇక వైసీపీ పని అయిపోయినట్టే అనే టాక్ నడుస్తోంది.