అంతర్వేది రథం దగ్ధం కేసుని సీబీఐ విచారణకు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుగాలి ప్రీతిపై హత్యాచారం కేసు విచారణ బాధ్యతని కూడా సీబీఐకే అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి భూముల వ్యవహారం కావొచ్చు, టెన్త్ ప్రశ్నా పత్రాల లీకుల వ్యవహారం కావొచ్చు.. ఇంకో వ్యవహారం కావొచ్చు.. రాష్ట్ర దర్యాప్తు సంస్థల్ని వైసీపీ సర్కారు రంగంలోకి దించుతోంది.
అంతెందుకు, ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ప్రభుత్వంలో వున్నవారికి వ్యతిరేకంగానో, అధికార పార్టీకి చెందిన నేతలకు వ్యతిరేకంగానో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, వాటిపైనా కఠిన చర్యలుంటున్నాయ్. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది.
మరి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ఎందుకు లైట్ తీసుకున్నట్టు.? అదంటే ప్రస్తుతం సీబీఐ విచారణ పరిధిలో వుంది గనుక, ఏపీ సర్కారు ఏమీ చేయలేదట. అసలంటూ, వైసీపీ సర్కారుకి విచారణ చేతకాకపోవడం వల్లనే కదా, సీబీఐ విచారణను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కోరింది, హైకోర్టుకి వెళ్ళి మరీ సీబీఐ విచారణను సాధించుకున్నది. ఇప్పుడామె ఆ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు.
ఇంతటి ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్యకు సంబంధించి విచారణను వైఎస్ షర్మిల ఎందుకు కోరగలుగుతారు.? కానీ, కోరాలి.! ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పాలన రావాలంటూ ఊరూ వాడా తిరిగారామె. గతంలో పాదయాత్ర చేశారు, 2019 ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడామె ఏపీ రాజకీయాల్లోంచి తప్పించుకుని, తెలంగాణ రాజకీయాల్లో సందడి చేస్తున్నారు.
‘మా నాన్నను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపాలనుకుంటున్నారు..’ అంటూ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడమెందుకు, నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఇవేవీ జరగవనుకుంటే, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కుదిరితే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అయినా ఫిర్యాదు చేయొచ్చు.
అయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికిది.? తద్వారా రాజకీయంగా లాభపడిందెవరు.? ఇప్పుడు వైఎస్ షర్మిలను చంపాల్సిన అవసరం ఎవరికొస్తుంది.? అలా చేస్తే రాజకీయంగా ఎవరు లాభపడతారు.?
171520 365320Undoubtedly,Chilly location! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 38241