Switch to English

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.. అధికారాన్ని తెచ్చిపెట్టింది కూడా. అధికారంలోకి వచ్చాక.. మళ్ళీ జనంలోకి వెళ్ళిన పాపాన పోలేదు వైఎస్ జగన్.. అన్న విమర్శలున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

అంతకు ముందు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. నిజానికి వైఎస్సార్ పాదయాత్రతో వైఎస్ జగన్ పాదయాత్రను పోల్చలేం.. పోల్చి చూసి వైఎస్సార్ పాదయాత్రను అవమానించలేం.. అంటారు చాలామంది.

ఇక, ఇప్పుడు అన్న బాటలో చెల్లెమ్మ వైఎస్ షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు. 400 రోజులపాటు సుమారు 4000 కిలోమీటర్ల మేర షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేస్తారట. రేపట్నుంచే ప్రారంభమవుతుందిది. ఉదయం ఓ నాలుగు గంటలు, ఆ తర్వాత ఓ రెండున్నర గంటలు రెస్ట్ తీసుకుని, మరో మూడు గంటల పాటు పాదయాత్ చేస్తారట షర్మిల. కాన్సెప్ట్ అదిరింది కదూ.!

రోజుకి సరాసరి పది కిలోమీటర్ల మేర పాదయాత్ర వుండేలా ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు చేవెళ్ళలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. నిజానికి షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల.. అదీ అన్న వైఎస్ జగన్ కోసం.

ఆ అన్న వైఎస్ జగన్ రాజకీయంగా తనకు మొహం చాటేయడంతో, తెలంగాణలో కొత్త కుంపటి పెట్టారు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో. పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావొచ్చన్న సెంటిమెంట్ తెలుగునాట బలంగా వుంది. మరి, షర్మిల కోరిక నెరవేరుతుందా.? ఆమె రాజకీయ ప్రస్థానం ఎలాంటి మలుపులు తిరగబోతోంది.? వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

మహేష్ తో కూడా బాలయ్య అన్ స్టాపబుల్!!

నందమూరి బాలకృష్ణ ఆహాలో ఒక టాక్ షో చేయబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే బాలయ్య స్టేజ్ మీద ఒక ఫ్లో...

సిద్ధ పాత్రపై పూర్తి క్లారిటీ ఇచ్చిన చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చరణ్ ఈ చిత్రంలో సిద్ధగా కనిపించనున్నాడు....

సర్ప్రైజ్: వెంకీ సినిమాలో కూడా సల్మాన్!!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. నిన్న అంతిమ్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు...

రాజకీయం

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ 5: బిగ్ షాక్: ఎలిమినేట్ అయిన రవి

బిగ్ బాస్ సీజన్ 5 లో అతిపెద్ద షాక్ ఇప్పుడు వచ్చింది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రేపటితో 12వ వారాన్ని పూర్తి చేసుకోబోతోంది. రేపు ఇంటి నుండి...

రాజ’శేఖర్’: దర్శకత్వ మార్పు దేనికోసం?

కొన్నేళ్ల క్రితం గరుడవేగ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు సీనియర్ హీరో రాజశేఖర్. దాని తర్వాత చేసిన కల్కి ప్రయత్నం బెడిసికొట్టింది. రీసెంట్ గా కరోనాతో పోరాడి ఆరోగ్యం విషయంలో చాలా సీరియస్ అయ్యి...

బికినీలో సెగలు రేపుతోన్న ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా సినిమాల పరంగా ఇప్పుడు అంత యాక్టివ్ గా లేకపోయినా కానీ సోషల్ మీడియాలో అమ్మడు రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను, టాప్ కర్వీ బాడీని ప్రదర్శిస్తూ అందరి...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈరోజే ప్రేక్షకుల ముందుకు...

చట్టసభలంటే ఇంతేనా.? ఇలాగేనా.?

చట్ట సభలంటే ప్రజల్లో ఏహ్యభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. చట్ట సభ విషయమై ప్రజల్లో క్రమంగా అసహనం కూడా పెరిగిపోతోంది. చట్ట సభలతో తమకేంటి సంబంధం.? అన్నట్టు ప్రజలూ ఓ నిర్వేదానికి వచ్చేస్తున్నారు. ఎన్నికలొస్తాయ్.....