ఇప్పుడు ఏపీలో వైఎస్ కుటుంబ ఆస్తుల పంచాయితీ మొదలైంది. జగన్ మొన్న రాసిన లేఖ నుంచే ఇది పీక్స్ కు వెళ్లిపోయింది. ఆ తర్వాత షర్మిల ప్ర్యత్తుత్తరం కూడా రాసింది. అది మరింత దుమారం రేపింది. మాజీ సీఎం జగన్ ఈ రోజు విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాతో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నా కుటుంబ వ్యవహారాలను తెరమీదకు తెస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ సారి నా తల్లి, చెల్లి ఫొటోలను పెట్టి రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
జగన్ వ్యాఖ్యలు అటు షర్మిల కూడా కౌంటర్ వేశారు. ఇంట్లో సమస్యలు ఉండవా అంటూ ప్రశ్నించారు. ఇంట్లో గొడవలు ఉంటే కోర్టుల్లో తల్లి, చెల్లిపై కేసులు వేస్తారా అంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఆమె అంతకుముందు రాసిన లేఖలో కూడా జగన్ ను నేరుగానే టార్గెట్ చేశారు. తనకు, తన పిల్లలకు అరకొర ఆస్తులు ఇచ్చి వెళ్లగొట్టాలని చూశావ్ అంటూ జగన్ మీద ఆరోపించారు. తన తండ్రి సంపాదించిన ఆస్తుల్లో నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని ఆదేశించారని.. కానీ జగన్ అన్న దాన్ని తుంగలో తొక్కావ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్ వోయూలో చేసిన ఒప్పందం ప్రకారం ఆస్తులన్నింటిలో వాటా ఇవ్వాలని లేదంటే న్యాయ పోరాటం చేస్తానంటూ హెచ్చరించారు. మొత్తానికి ఇలా ఏపీలో అన్నా, చెల్లెలు ఆస్తుల పంచాయితీ మొదలైంది. ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంది.