సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,291FansLike
57,764FollowersFollow

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి మీద అత్యంత అసభ్యకరమైన చర్చా కార్యక్రమాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించారు.

తనకు అత్యంత సన్నిహితుడైన ఇంకో మురికి జర్నలిస్టు కృష్ణంరాజుని తీసుకొచ్చి, అమరావతిపై ‘వేశ్యలకు రాజధాని’ అంటూ వ్యాఖ్యలు చేయించినందుకుగాను కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసులు నమోదవడం, ఈ క్రమంలో ఆయన అరెస్టవడం తెలిసిన విషయాలే.

సర్వోన్నత న్యాయస్థానంలో కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చిన దరిమిలా వైఎస్ జగన్, ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీటేశారు. దాంతో, వైసీపీ శ్రేణులే ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, న్యాయ వ్యవస్థల మీద గతంలో వైసీపీ నాయకులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అలాంటివి.

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గతంలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చట్ట సభలపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి, న్యాయ వ్యవస్థపై వైసీపీ నాయకులతో అవాకులు చెవాకులు పేలేలా చేసిన విషయం ఎలా మర్చిపోగలం.?

న్యాయ వ్యవస్థని చంద్రబాబు మేనేజ్ చేస్తారంటూ వైఎస్ జగన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని వైసీపీ శ్రేణులే సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నాయి. ‘సత్యమేవ జయతే’ అని మనం ఎలా అనగలుగుతున్నాం.? అన్న వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాదానం చెప్పుకోవాలి.

సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా అమరావతి మీద ‘వేశ్యలకు రాజధాని’ అని దుష్ప్రచారం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది.

సరిగ్గా ఈ తరుణంలో కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం, వైఎస్ జగన్ ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీటేయడం ఆశ్చర్యకరమే. వైసీపీ హయాంలో మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపిన వైఎస్ జగన్, ఇప్పుడు తన సొంత మీడియా ద్వారా నిత్యం దుష్ప్రచారాలు చేస్తూనే వున్న సంగతి తెలిసిందే.

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

Vijay-Trisha: త్రిష పేరు మీదే పార్టీ..!? విజయ్ కి కొత్త తలనొప్పి

Vijay-Trisha: తమిళ హీరో విజయ్ విడాకుల వివాదం తమిళనాట సంచలనం రేపుతోంది. పేరు చెప్పకుండా విజయ్ ఓ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య సంగీత ఆరోపించారు. అయినా.. సోషల్ మీడియాలో నటి...

ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: లోకేష్

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh శాసనసభలో తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ...

ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలు చేర్చాలి: ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గం గాయత్రి నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్...

వేట్లపాలెం పేలుడు ఘటనపై రాజమండ్రిలో సీఎం–డిప్యూటీ సీఎం భేటీ,

రాజమండ్రి: వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కాకినాడ...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ...