అక్రమాస్తుల కేసులో బెయిల్ మీదున్నదెవరు.? విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ కోరాల్సింది ఎవరు.? ప్రతి శుక్రవారం కోర్టులో ప్రత్యక్ష విచారణకు హాజరు కావాల్సి వున్నా, కుంటి సాకులతో తప్పించుకుంటున్నదెవరు.?
ది వన్ అండ్ ఓన్లీ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అక్రమంగా ఆస్తులు పోగేశారన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదున్న ఆరోపణల సారాంశం. దాదాపు మూడు డజన్ల వరకు కేసులున్నాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద.
ఇవే ఆస్తులకు సంబంధించి పంపకాల లొల్లి నేపథ్యంలో తల్లినీ, చెల్లినీ కోర్టుకు లాగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే, ఇప్పుడు వ్యస్థీకృత నేరం.. అంటూ టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద ఆరోపణలు చేస్తూ, పెద్ద ట్వీటేశారు.
ప్రెస్ మీట్ పెట్టి, ఆ మొత్తం ట్వీటుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యధాతథంగా, తడుముకోకుండా చెప్పగలరా.? పోనీ, చదవగలరా.? అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి.
ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చాలా తేలిగ్గా రాజకీయ ప్రత్యర్థుల మీద ‘వ్యవస్థీకృత నేరం’ అంటూ ఆరోపణలు గుప్పించేస్తుంటే, నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదు రాష్ట్ర ప్రజానీకానికి.
వైసీపీ శ్రేణులే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీటుని పై నుంచి కింద వరకూ చదవడానికి ఇష్టపడని పరిస్థితి. ఆయన ట్వీటేస్తే వచ్చే స్పందన చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ఆర్థిక నేరాలు, అందునా వ్యవస్థీకృత నేరాల గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, వాటిపై పోలీసుల చర్యలు.. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నచ్చకపోవచ్చుగాక. ఎందుకంటే, వాటిని పెంచి పోషించిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ తరహా జుగుప్సాకరమైన వ్యవహారాలను వ్యవస్థీకృతం చేసింది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే.