సోషల్ మీడియాలో ట్రోలింగ్ నేరం కాదు.! కానీ, అది హద్దులు దాటకూడదు.! సోషల్ మీడియాలో ప్రశ్నించడం తప్పు కాదు.. కానీ, బూతులు వాడటం తప్పే.! చిన్న పిల్లలపై జుగుప్సాకరమైన ట్రోలింగ్ కావొచ్చు, అభ్యంతకరమైన బూతులు కావొచ్చు.. ఖచ్చితంగా ఖండించాల్సిన విషయాలే.
తప్పుడు ప్రచారం సంగతి సరే సరి.! చట్టాలున్నాయ్.. కానీ, అవి సమర్థవంతంగా అమలవడంలేదు. ఎంతమందిని అరెస్ట్ చేయడానికి ఆస్కారముంటుంది.? జైళ్ళు సరిపోతాయా.? ఏడేళ్ళ కంటే తక్కువ శిక్ష పడే నేరాలకి అరెస్టులు ఎంతవరకు సబబు.? రిమాండ్ పరిస్థితేంటి.? ఇలా చాలా న్యాయపరమైన అంశాలున్నాయి.
ఇక, సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు గత కొన్నేళ్ళుగా చేస్తున్న జుగుప్సాకరమైన రాజకీయం.. అత్యంత హేయం. వైసీపీ హయాంలో అయితే, బాధితుల మీద కేసులు పెట్టిన పరిస్థితులున్నాయ్. రాత్రికి రాత్రి, సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్టు చేసి హింసించిన దాఖలాలున్నాయ్.
వృద్ధుల్ని సైతం ‘లిఫ్ట్’ చేయడం అప్పట్లో పెను సంచలనం. న్యాయస్థానాలు పదే పదే పోలీస్ వ్యవస్థకి వైసీపీ హయాంలో మొట్టికాయలు వేయడం చూశాం. కక్ష సాధింపు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయ్ అప్పట్లో.
కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. అరెస్టులే అరకొరగా జరుగుతున్నాయ్.. ఇలా అరెస్టయి, అలా విడుదలవుతున్నారు.. ఆషామాషీ వ్యక్తులు కాదు, సోషల్ టెర్రరిస్టులనదగ్గ రీతిలో కరడుగట్టిన వ్యక్తులు వీళ్ళంతా.
పవన్ కళ్యాణ్ కుమార్తెలపైనా, చంద్రబాబు కోడలిపైనా.. ప్రస్తుత హోంమంత్రిపైనా.. ఒక్కరని కాదు.. రాజకీయ ప్రత్యర్థుల మీదా, వాళ్ళ ఇంట్లోని పసివాళ్ళపైనా.. వైసీపీ సోషల్ టెర్రరిస్టులు అత్యంత అసభ్యకరమైన రీతిలో కామెంట్లు చేశారు. అలాంటివారు ఇలా అరెస్టయి, అలా బెయిల్ మీద విడుదలైపోతున్నారు.
కానీ, వైసీపీ ఈ అరెస్టులపై అత్యంత హేయమైన రీతిలో దుష్ప్రచారం చేస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేసి, వేధిస్తారా.? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అమాయకంగా ప్రశ్నించేస్తున్నారు. అలా ప్రశ్నించే ముందర, వైసీపీ పెంచి పోషిస్తున్న సోషల్ టెర్రరిస్టులు ఎలాంటి జుగుప్సాకరమైన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా చేశారో, వైఎస్ జగన్ చదువుకుంటే మంచిది.!
జగన్ సోదరి అయిన షర్మిల మీద కూడా ఈ వైసీపీ టెర్రరిస్టులు జుగుప్సాకరమైన భాష ప్రయోగించారు. విజయమ్మ కూడా ఈ సోషల్ టెర్రరిస్టుల బూతులకు ఆవేదన చెంది వుంటారు.! ‘నా పుట్టుకని కూడా వాళ్ళు అవమానించారు. అలాంటివాళ్ళని వైసీపీ తయారు చేసింది..’ అని షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
సభ్య సమాజం అసహ్యించుకుంటున్న ఇలాంటి సోషల్ టెర్రరిస్టులని వైఎస్ జగన్ వెనకేసుకురావడం ఓ పెద్ద వింతగానే చెప్పుకోవాలి.! పైగా, వాళ్ళకి వైఎస్ జగన్ న్యాయ సహాయం అందిస్తారట పార్టీ పరంగా. పార్టీ నుంచే వాళ్ళని ప్రోత్సహిస్తూ, సంఘ వ్యతిరేక శక్తులుగా వాళ్ళని మార్చి, మళ్ళీ వారికి న్యాయ సహాయం అందించడం ఏమిటో.!