Switch to English

కర్నూలులో వైఎస్‌ జగన్‌ ‘షో’ అదిరిందిగానీ..

కర్నూలును జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా ప్రతిపాదించిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లాకు ఈ రోజు వెళ్ళారు. దాంతో, అక్కడ వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణను చేపట్టాయి. రోడ్డుకి ఇరువైపులా వైసీపీ శ్రేణులు, పార్టీ జెండాలతో నిలబడి వైఎస్‌ జగన్‌కి ఘన స్వాగతం పలికారు. స్కూళ్ళ నుంచి పెద్దయెత్తున విద్యార్థుల్ని కూడా ఈ కార్యక్రమానికి తరలించడం గమనార్హం.

మరోపక్క, కర్నూలులో బహిరంగ సభ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ జగన్‌. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పేరు ప్రస్తావించలేదుగానీ, ప్రతిపక్షాలకు చెందిన.. అంటూ చంద్రబాబుతోపాటు, పవన్‌నీ పరోక్షంగా ప్రస్తావించిన జగన్‌, ‘ఆరోగ్యశ్రీలో చాలా రోగాలకు మందు వుంది.. కానీ, కొందరి అసహనానికీ, అక్కసుకీ వైద్య చికిత్స మాత్రం ప్రపచంంలో ఎక్కడా దొరకదు..’ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌, ఆద్యంతం రాసుకొచ్చిన స్క్రిప్‌ని చదివి విన్పించడంతో అంతా ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.

మరోపక్క, మూడేళ్ళలో ప్రభుత్వాసుపత్రుల రూపు రేఖలు మారిపోతాయనీ, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్ని మార్చేస్తామనీ చెప్పుకొచ్చారు వైఎస్‌ జగన్‌. అది జరిగే పనేనా.? వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ప్రభుత్వాసుపత్రులు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి.. దానికి కారణం ఆరోగ్యశ్రీ పథకమేనంటారు చాలామంది. ఆ విషయం పక్కన పెడితే, వైఎస్సార్‌ కంటి వెలుగు పథకానికి సంబంధించి మూడో విడతను నేడు వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. మరోపక్క, కర్నూలులో పలువురికి వైఎస్‌ జగన్‌ ఆరోగ్యశ్రీ కార్డుల్నీ అందించారు.

ఇదిలా వుంటే, కర్నూలులో వైఎస్‌ జగన్‌ అధికారిక పర్యటననీ, మొన్నీమధ్యనే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటననీ కొందరు పోల్చి చూస్తున్నారు. అధికార పర్యటనకు పెద్దయెత్తున జన సమీకరణ చేపట్టినాసరే, వైఎస్‌ జగన్‌.. జనసేనానితో పోటీ పడలేకపోయారన్న చర్చ జరుగుతోంది. అయితే, పవన్‌ టూర్‌కి చెంపపెట్టులా వైఎస్‌ జగన్‌ అధికారిక టూర్‌ జరిగిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...

6 ఏళ్ల ‘మనం’ జర్నీలో ఆసక్తికర విషయాలు కొన్ని.!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియంది కాదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున దిగ్విజయంగా కొనసాగిస్తే.. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ తో...