Switch to English

అమ్మకానికి ప్రభుత్వ భూములు.. అదిరిందయ్యా జగన్‌.!

అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అమ్మేస్తారా.? అంటే ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నోసార్లు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. అంతకు ముందు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు, అప్పటి ప్రభుత్వాల్ని చంద్రబాబు కూడా ఇలాగే ప్రభుత్వ భూముల అమ్మకాలపై నిలదీశారు.

ఏ ప్రభుత్వమైనా, ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాలతోపాటు, ప్రభుత్వ భూముల్ని అమ్మడం కూడా చేస్తుంటుంది. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఏం మాట్లాడాం.? అధికారంలో వున్నప్పుడు ఏం చేస్తున్నాం.? అని ఎవరికి వారు ప్రశ్నించుకునేంత ‘ఇంగితం’ రాజకీయాల్లో వుండదుగాక వుండదు.

ఇక, అసలు విషయానికొస్తే, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా 300 కోట్ల రూపాయల రాబడిపై దృష్టిపెట్టింది. ఈ మేరకు ఆయా భూముల వివరాల్ని అధికారికంగానే ప్రకటించారు. గుంటూరు, విశాఖ జిల్లాల్లోని భూముల్ని అమ్మకానికి పెట్టారు. మొత్తం 300 కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేస్తోందిగానీ, ఇంకాస్త ఎక్కువే వచ్చే అవకాశం వుందన్న వాదన అధికార పార్టీలో విన్పిస్తోంది.

సహజంగానే ఇలాంటి విషయాల్లో అధికార పార్టీ నేతలే ముందుంటారు. సో, అధికార పార్టీ నేతలకే ఈ భూములు దక్కుతాయేమో.! ‘జగనన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నారు.. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే అద్భుతమైన పాలన అందిస్తున్నారు..’ అంటూ వైసీపీ నేతలు ఓ పక్క చెబుతున్న దరిమిలా, సంక్షేమ పథకాల అమలు కోసం భూముల్ని అమ్మాల్సిన ఖర్మ ఏం పట్టింది.? అన్న చర్చ సహజంగానే ఉత్పన్నమవుతోంది.

సంక్షేమ పథకాల అమలు కోసమే భూముల్ని అమ్మేయాల్సి వస్తే.. రేప్పొద్దున్న ఇంకా చాలా సమస్యలు ఎదురు కానున్నాయి. అప్పుడేం చేస్తారట.? ఇంకేం చేస్తారు, రాష్ట్రంలో ల్యాండ్‌ బ్యాంక్‌ బాగానే వుంది.. మొత్తంగా అమ్మి పారేస్తారేమో.! ప్రభుత్వానికి భూముల అమ్మకాలపై అధికారాలు వుండొచ్చుగాక. కానీ, ఇదేం పద్ధతి.? ఇలా భూములు అమ్ముకుంటూ పోతే, రేప్పొద్దున్న ప్రభుత్వ అవసరాల కోసం భూమి దొరికే అవకాశం వుండదు కదా.!

పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా భూముల లభ్యత లేక నానా పాట్లు పడుతోంది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో భూముల అమ్మకం అనేది మూర్ఖపు వ్యవహారం కాక మరేమిటి.?

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

బర్త్‌డే స్పెషల్‌ : మదిని పులకింపజేసే మ్యాజిక్‌ మేస్ట్రో పాటలు

సౌత్‌ ఇండియాలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఇళయరాజా పాటలకు అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ట్యూన్స్‌తో గత 30 ఏళ్లుగా ఆయన తన సంగీత సామ్రాజ్యంలో అభిమానులను...

నా సినిమా బాహుబలి 2 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం దాదాపుగా రెండు వేల కోట్లను వసూళ్లు చేసిన విషయం తెల్సిందే. వందేళ్ల సినీ చరిత్రలో ఆ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా లేదనే...

అబ్జర్వేషన్‌: సీఎం జగన్‌.. ఏడాది పాలనకి మార్కులెన్ని.?

సంచలన విజయానికి ఏడాది.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. మొత్తంగా 175 సీట్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి వుంటే, అందులో 151 సీట్లను వైఎస్‌ జగన్‌...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

మరో స్టార్‌ను బలి తీసుకున్న కరోనా

కరోనా కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం సినీ కార్మికులు మాత్రమే కాకుండా కొందరు స్టార్స్‌ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే...