Switch to English

ఏపీలో బియ్యం డోర్‌ డెలివరీ.. అదిరిందయ్యా జగన్‌.!

ప్రజలకు మేలు కలిగే ఏ చర్యలు ప్రభుత్వం తీసుకున్నా అభినందించి తీరాల్సిందే. రేషన్‌ దుకాణాలంటే అవినీతికి, దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌ అనే అభిప్రాయాలు ఇప్పటికీ వున్నాయి. అంతెందుకు, ఈ మధ్యనే రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిన వైనం విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. అధికార పార్టీ ఎంపీనే ఈ విషయమై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు ఎంపీగారికి చెందిన ట్రస్ట్‌కి రేషన్‌ బియ్యం తరలి వెళుతున్న వ్యవహారం బట్టబయలయ్యింది. ఆ సంగతి పక్కన పెడితే, ప్రభుత్వం రేషన్‌ బియ్యం విషయమై కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్‌ బియ్యాన్ని సెప్టెంబర్‌ 1 నుంచి డోర్‌ డెలివరీ చేయనుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకోబోతోంది. ప్రత్యేకంగా తయారు చేసిన సంచులతోపాటు, బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేసేందుకు అనుగుణంగా ఓ ప్రత్యేక వాహనాన్నీ అందుబాటులోకి తెస్తున్నారు. మొత్తం 13,370 మొబైల్‌ యూనిట్ల ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయనుంది ప్రజా పంపిణీ వ్వవస్థ.

లబ్దిదారుల ముందే బస్తా సీల్‌ని ఓపెన్‌ చేసి, వారికి నిర్దేశించిన కోటా ప్రకారం ఈ కొత్త విధానం ద్వారా అందించనున్నారట. నిజంగానే అభినందించాల్సిన విషయమిది. అయితే, నాణ్యమైన బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి వుంటే బావుండేది. ఈ నాణ్యమైన బియ్యం – సన్నబియ్యం చుట్టూ నానా యాగీ జరుగుతున్న విషయం విదితమే.

వైఎస్‌ జగన్‌, ఎన్నికల ప్రచారంలో ‘సన్నబియ్యం’ ప్రస్తావన తీసుకురాగా, అదంతా ఉత్తదేనని ఆ తర్వాత అదే వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి అయ్యాక బుకాయించారు. ఆఖరికి తన సొంత పత్రిక సాక్షిలో వచ్చిన కథనాల్నీ తప్పుడు కథనాలుగా కొట్టి పారేశారు వైఎస్‌ జగన్‌.

ఏదిఏమైనా, ప్రజా పంపిణీకి సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేయగలిగితే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిందే. కానీ, రేషన్‌ బియ్యాన్ని నమ్ముకున్న రాజకీయ పందికొక్కులు ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తాయా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ఒక ప్రియురాలిని చంపి మరో ప్రియురాలితో పారిపోయాడు

అక్రమ సంబంధాలు హత్యలకు దారి తీస్తాయని ఎంత మంది ఎన్ని రకాలుగా హెచ్చరించినా కూడా జనాలు మాత్రం అక్రమ సంబంధాలను వదిలి పెట్టడం లేదు. ఎన్నో రకాలుగా అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు...

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....

టాలీవుడ్‌కి తీపి కబురు సరే.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఎలా.?

తెలుగు సినీ పరిశ్రమకు తీపి కబురు అందబోతోంది. త్వరలో షూటింగులకు అనుమతి లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని, తమ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చిందంటూ ఈ రోజు ప్రభుత్వ పెద్దలను కలిసిన...

ఫ్లాష్ న్యూస్: తల్లి శవంను రోడ్డున పడేసిన కొడుకు

వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు...

మహానటిని రికమెండ్ చేసిందంటే ఏదో మతలబుంది?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంతో పాటు చూసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా...