Switch to English

దెబ్బ మీద దెబ్బ: ఇరకాటంలో వైఎస్‌ జగన్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

మొన్న ప్రపంచ బ్యాంకు.. నిన్న ఇంకో బ్యాంకు.. వెరసి, ఆంధ్రప్రదేశ్‌కి సాయం చేసే విషయంలో ఒక్కొక్కరూ వెనక్కి తగ్గుతుండడమంటే, ముందు ముందు ఆంధ్రప్రదేశ్‌కి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయనే అర్థం.! అవును, ప్రమాద ఘంటికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. ఉమ్మడి రాష్ట్రం విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఇది జగమెరిగిన సత్యం.

అయితే, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోలేకపోయింది. దానికి చంద్రబాబు పాలనలోని అవినీతే కారణమంటూ వైఎస్సార్సీపీ ఆరోపిస్తూ వచ్చిన విషయం విదితమే. ఇప్పుడు జగన్‌ చేతిలో అధికారం వుంది. సంక్షేమ పథకాల పేరుతో ఎడా పెడా అందుబాటులో వున్న నిధుల్ని ఖర్చు చేసేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఖర్చుకు తగ్గ రాబడి లేనప్పుడు అప్పులే దిక్కు. కేంద్రం ఎలాగూ రాష్ట్రానికి సాయం చేసే పరిస్థితి లేదు. ‘అమ్మ పెట్టా పెట్టదు.. అడక్కు తినానివ్వదు..’ అన్నట్టుగా, రాష్ట్రానికి సాయం చేసేందుకు ముందుకొచ్చే ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థల విషయంలో కేంద్రం చిత్రమైన వైఖరి ప్రదర్శిస్తూ.. ‘అటువైపు వెళ్ళొద్దు..’ అన్నట్టుగా ఆయా సంస్థల్ని వెనక్కి పంపించేస్తోంది.

వాస్తవానికి పరిస్థితులు ఇలా మారతాయని వైఎస్‌ జగన్‌ ఊహించి వుండరు. ‘రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తాం’ అని ప్రధాని హోదాలో జగన్‌కి నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో, ఆ హామీని జగన్‌ నమ్మేశారు. కానీ, గతంలో చంద్రబాబుకి ఎలాగైతే షాకిచ్చారో, అదే షాక్‌ ఇప్పుడు మోడీ, జగన్‌కి ఇస్తున్నారు. రాష్ట్ర పరిస్థితిపై ఎప్పటికప్పుడు రాష్ట్రం తరఫున విజయసాయిరెడ్డి ద్వారా నరేంద్ర మోడీకి వైఎస్‌ జగన్‌ తెలియజేస్తున్నా, కేంద్రం పట్టించుకోవడంలేదాయె. ఇదిలా వుంటే, ఇంకోపక్క.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి ఇప్పుడిప్పుడే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు వైఎస్‌ జగన్‌.

45 ఏళ్ళు దాటితే పెన్షన్‌.. అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు గతంలో కురిపించిన వరాలజల్లు ఒక్కటే కాదు, రైతుల సమస్యలపై జగన్‌ ప్రకటించిన నిర్ణయాలతోపాటు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన ఉద్యోగావకాశాలపైనా సందిగ్ధత నెలకొంది. వీటన్నిటికీ కారణం నిధుల లేమి. ముఖ్యమంత్రిగా రెండో నెల పూర్తి చేసుకోకుండానే జగన్‌కి దెబ్బ మీద దెబ్బ పడ్తోందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. విపత్కర పరిస్థితుల్ని అధిగమించడానికి వీల్లేకుండా అష్టదిగ్బంధనం.. అన్నట్టుగా జగన్‌ పరిస్థితి తయారైందిప్పుడు.

9 COMMENTS

  1. 18683 852937Its always very good to learn guidelines like you share for blog posting. As I just started posting comments for weblog and facing difficulty of lots of rejections. I believe your suggestion would be valuable for me. I will let you know if its work for me too. 773265

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...