Switch to English

చేతులెత్తేసిన జగన్‌.. ఈ నెలలోనే స్థానిక ఎన్నికలు.!

రిజర్వేషన్ల కోటా 59.85 శాతానికి పెంచితే, కోర్టు మొట్టికాయలు తప్పవని తెలిసే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్థానిక ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కోర్టు మొట్టికాయలేసింది.. రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాల్సి వస్తోంది. ఈ పాపాన్ని తెలివిగా టీడీపీ మీదకు నెట్టేసే ప్రయత్నం చేసింది అధికార వైఎస్సార్సీపీ. ‘బీసీల మీద చిత్తశుద్ధి వుంటే, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి..’ అని ఉచిత సలహాలిస్తున్న టీడీపీ ఎందుకు ఆ పని చేయడంలేదు.? అంటే, అదే మరి రాజకీయం. ఈ విషయంలో టీడీపీనీ, వైసీపీనీ ఒకే గాటన కట్టిపడేయాలేమో. ఇద్దరికీ రాజకీయ లబ్ది మాత్రమే కావాలి.. తప్ప, బీసీల మీద ఇద్దరికీ చిత్తశుద్ధి లేదన్నది నిర్వివాదాంశం.

ఇక, రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్ళే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. ఎందుకంటే, స్వయానా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, స్థానిక ఎన్నికలు ఈ నెలలోనే పూర్తి చేసెయ్యాలంటూ అధికారులకు దిశా నిర్దేశం చేసేశారు. అవును మరి, ఒకవేళ ఈ నెలలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయకపోతే, కేంద్రం నుంచి ఆయా పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన సుమారు 5 వేల కోట్ల నిధులు గల్లంతయిపోతాయి. అందుకే, స్థానిక ఎన్నికల కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొందరపడుతోంది. ఈ తొందరేదో గతంలోనే పడి వుంటే, ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేదే కాదు.

రిజర్వేషన్ల వ్యవహారంపై వైసీపీ – టీడీపీ మధ్య ఇంకా వివాదాలు, విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. రిజర్వేషన్లను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర పన్నిందని వైసీపీ ఆరోపిస్తోంటే, ఆ కుట్రకు తెరలేపాకే.. ప్రజల్ని మభ్యపెడుతూ 59.85 శాతం రిజర్వేషన్లను జగన్‌ ప్రభుత్వం ఖారారు చేసిందని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. మొత్తమ్మీద, స్థానిక ఎన్నికలకు ముందే రెండు ప్రధాన రాజకీయ పార్టీల బండారం బయటపడిపోయింది. ఇప్పుడిక నిర్ణయం తీసుకోవాల్సింది ఓటర్లే. స్థానిక ఎన్నికల్లో ఎటూ అధికార పార్టీకే ఎడ్జ్‌ వుంటుంది గానీ.. ఆ ఎడ్జ్‌ మీద ఈ ‘బీసీ నాటకం’ తాలూకు ఎఫెక్ట్‌ ఏమైనా పడుతుందా.? అన్నది వేచి చూడాల్సిందే.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

ఎక్కువ చదివినవి

బర్త్‌డే స్పెషల్‌ : తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్త

తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే, తెలుగు సినిమా చరిత్ర గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడటం అసాధ్యం. తెలుగు సినిమా అనే ప్రయోగశాలలో కృష్ణ ఎన్నో ప్రయోగాలు...

మిడతలను తరమికొట్టేందుకు రైతు వినూత్న ప్రయత్నం

‘నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ఏడాది అందరికీ శుభాలు జరగాలి’ అంటూ చెప్పుకుని రోజులు గడవక ముందే ప్రజలకు కష్టాలు మొదలైపోయాయి. కరోనా రూపంలో వచ్చిన ఉపద్రవం ప్రపంచ మానవాళిపై విరుచుకు పడుతోంది....

ఎబోలా మళ్లీ వచ్చింది.. ఈసారి నష్టం మరింత ఎక్కువ

2018 సంవత్సరంలో ప్రపంచాన్ని భయపెట్టిన ఎబోలా ఆ సమయంలో పెద్దగా నష్టపర్చలేదు. కొన్నాళ్లకే ఎబోలా కనుమరుగయ్యింది. దాని గురించి మర్చి పోయి అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో కరోనా వైరస్‌ మొదలైంది. ఇప్పటికే...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

వలస కూలీల కోసం ఏకంగా విమానం బుక్‌ చేసిన రియల్‌ హీరో

కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలో మీటర్ల దూరంను వలస కార్మికులు కేవలం కాలినడకన చేరుకున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేక పోవడంతో చాలా మంది తమ ప్రాంతాలకు...