Switch to English

హాస్యాస్పదం: నిమ్మగడ్డపై వేటుకి జగన్‌ సర్కార్‌ స్కెచ్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయాలకు తిరుగులేదు. ఆయన ఆలోచనల్ని ఎవరైనా వ్యతిరేకిస్తే అంతే సంగతులు. ప్రాంతీయ పార్టీల్లో ఈ పైత్యం సర్వసాధారణమే. కానీ, పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు. ప్రభుత్వంలో కూడా తనకు నచ్చినట్లే అధికారులు వుండాలనుకుంటే ఎలా.? తప్పయినా, ఒప్పయినా.. తాను అనుకున్నదే జరగాలనుకుంటే ఎలా.?

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల విషయమై హైకోర్టు మొట్టికాయలేసింది. ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తేయాలని ఆలోచన చేస్తే.. అక్కడా హైకోర్టు చెంప ఛెళ్ళుమనిపించేసింది.. మూడు రాజధానుల వ్యవహారం కూడా గందరగోళంలో పడింది. శాసన మండలి రద్దు వ్యవహారంలోనూ పరిస్థితులు అనుకూలంగా కన్పించడంలేదు. ఒకటేమిటి.? తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమే. అయినాగానీ, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు వ్యవహరిస్తున్నారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

ఓ పక్క కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ముంచెత్తుతున్న వేళ, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మంచిది కాదంటూ, ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయిస్తే.. ఆయనపై ‘కులం’ పేరుతో దూషణలకు దిగారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. వాయిదా వేయడం సబబు కాదంటూ స్థానిక ఎన్నికలపై జగన్‌ సర్కార్‌ సుప్రీం కోర్టుకి వెళితే, అక్కడా మొట్టికాయలే పడ్డాయి.

ఇక, ఇప్పుడు ఎలాగైనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించాలన్న ఆలోచన చేస్తోందట వైఎస్‌ జగన్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలో ఐదేళ్ళ పదవీ కాలాన్ని మూడేళ్ళకు కుదించేలా కొత్త ఆర్డినెన్స్‌ కోసం ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ‘ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌.. నేనింతే..’ అన్నట్లు వ్యవహరిస్తున్న జగన్‌.. అన్నంత పనీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, ఇంకోసారి మొట్టికాయ తప్పదా.? అంటే, అలాంటివి ఆయనకు అలవాటైపోయాయ్‌ మరి.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే...

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది....

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా...

రాజకీయం

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎక్కువ చదివినవి

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం...

Ustaad Bhagat Singh : గ్లాస్ డైలాగ్‌ ని బలవంతంగా చెప్పించాడు : పవన్‌

Ustaad Bhagat Singh : పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉస్తాద్‌ భగత్ సింగ్ టీజర్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ లో పవన్ కళ్యాణ్‌...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...