గత 56 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పుపై కట్టే వడ్డీ రూ. 14, 155 కోట్లు. ఇది 2019 నాటికి మాత్రమే. అప్పటినుంచి 2024 వరకు జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలానికి అప్పు మీద కట్టాల్సిన వడ్డీ ఏడాదికి రూ. 24,944 కోట్లకు పెరిగింది. అంటే కట్టాల్సిన వడ్డీ ఎకాఎకి 11 వేల కోట్లు పెరిగిందన్నమాట.
సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేయని అప్పులు లేదు. అప్పుచేసి పప్పుకూడులా ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని మార్చేసింది. 2015-16 లో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 40,000 కోట్లు. 2020-21 నాటికి ఆదాయం 80 వేల కోట్లు దాటింది. అంటే ఆదాయం దాదాపు రెట్టింపు అయింది.
అదే టైంలో కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ రాష్ట్ర పన్నుల ఆదాయం రెట్టింపడం గమనార్హం. అయితే ఆ ప్రభుత్వంలో నిధుల సమీకరణ మొత్తం సంక్షేమ పథకాల మీదే ప్రభుత్వం వెచ్చించింది.
రాష్ట్రానికి పలు మార్గాలుగా వచ్చే ఆదాయం సరిపోక కేంద్రం నుంచి వచ్చే వివిధ రకాల గ్రాంటులను కూడా దారి మళ్ళించింది. అయితే ఇక్కడ ఆ సంక్షేమ పథకాలు కూడా పేదలకు పూర్తిస్థాయిలో అందలేదన్న విషయం గుర్తుంచుకోవాలి.