Switch to English

అధికారులపై అక్కసు.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మొట్టికాయలు.!

సీనియర్‌ అధికారులపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అసహనంతో ఊగిపోతోందా.? అంటే, ‘అవును’ అని చెప్పడానికి ఇటీవలి కాలంలో చాలా సంఘటనల్ని ఉదాహరణలుగా చెప్పొచ్చేమో. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను అతి కొద్ది కాలంగానే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘పక్కన’ పెట్టింది. చీఫ్‌ సెక్రెటరీగా పనిచేసిన ఆయనపై బాహాటంగా ఆరోపణలు అయితే చేయలేదుగానీ, అత్యంత అవమానకరంగా ఆయనపై బదిలీ వేటు వేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అప్పట్లో ఈ విషయమై నానా యాగీ జరిగింది.

మరోపక్క, సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై అయితే ఏకంగా సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మధ్యనే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపైనా అనేక ఆరోపణలు చేస్తూ, సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే. కాగా, తనపై పడ్డ సస్పెన్షన్‌ వేటుని జాస్తి కృష్ణ కిషోర్‌, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌లో సవాల్‌ చేశారు. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు పడినట్లు ప్రచారం జరుగుతోంది. జాస్తి కృష్ణ కిషోర్‌, కేంద్ర సర్వీసులకు వెళ్ళేందుకు క్యాట్‌ అనుమతివ్వడమే ఇందుకు నిదర్శనం.

మరోపక్క, ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పేలా లేవు. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన విషయం విదితమే. ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం వేతనం చెల్లించకపోవడం గమనార్హం. ఈ విషయమై ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే క్యాట్‌ని ఆశ్రయించిన విషయం విదితమే. ఏదిఏమైనా అధికారుల విషయంలో ప్రభుత్వాలు అత్యుత్సాహంతో తీసుకునే చర్యలు ఇలాగే బెడిసి కొడుతుంటాయి. అయినాగానీ, ప్రభుత్వాల తీరు మారడంలేదు.

రాజకీయ కక్ష సాధింపులకి ‘అధికారం’ భలేగా ఉపయోగపడ్తోందిగానీ, పదే పదే మొట్టికాయలు వేయించుకోవడం ప్రభుత్వాధినేతలకు అస్సలేమాత్రం మంచిది కాదు. సస్పెండ్‌ అవడం ద్వారా సదరు అధికారుల ఇమేజ్‌కి కొంత డ్యామేజ్‌ అయ్యే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో, క్యాట్‌ని ఆశ్రయించి ఉపశమనం పొందితే మాత్రం.. అది ఆయా అధికారులకు, ఆయా ప్రభుత్వాలపై సాధించిన ఘనవిజయంగానే పరిగణించాల్సి వస్తుంది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఆఫ్రికా నుండి ఇండియాకు చేరిన మిడుతల దండు

మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలను అల్లాడించి అతలాకుతలం చేసిన మిడతల దండు పాకిస్తాన్ మీదుగా ఇండియా చేరింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో ఈ మిడతల దండు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట...

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...

ఫ్లాష్ న్యూస్: 91 మందికి కరోనా అంటించిన బార్బర్

ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకుంటున్న సమయంలో...

ప్రభాస్ – పూరి.. జరిగే పనేనా?

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి...

క్రైమ్ న్యూస్: ఇద్దరు చిన్నారులను కడ తేర్చిన తండ్రి.. తాగిన మత్తులో ఘోరం

ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కర్కశుడయ్యాడు. తండ్రిగా విద్యాబుద్దులు చెప్పించి, పెద్ద చేయాల్సిన బాధ్యతను విస్మరించాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సింది తాగిన మత్తులో కాటికి చేర్చాడు. విషాదకరమైన ఈ...