Switch to English

ప్రజల ప్రాణాలకంటే ‘ఇంగ్లీషు మీడియం’ ముఖ్యమా.?

మే నెల 3వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియాల్సి వుంది. ముగుస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. నిజానికి, ఏప్రిల్‌ 14 తర్వాత దేశంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయాల్సి వుంది. కానీ, అది జరగలేదు. కారణం అందరికీ తెల్సిందే. దాంతో, మే 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారనే ‘ఆశ’ ఎవరికీ లేదు. అలా ఎత్తేస్తే అది అత్యంత ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుందనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా వుంటే, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మాత్రం, ప్రజల ప్రాణాల పట్ల కనీసపాటి బాధ్యత కూడా లేకుండా తన ‘రాజకీయం’ తాను చేసుకుంటూ పోతోంది. హైకోర్టు మొట్టికాయలు వేసినా, ఇంగ్లీషు మీడియం విషయంలో తమ మొండితనం వీడేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు వైఎస్‌ జగన్‌ సర్కార్‌. తాజాగా విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయణ సేకరణ కోసం ప్రయత్నాలు షురూ చేసింది. ఈ సమయంలో ఇది అవసరమా.? అని రాష్ట్ర ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. ‘గ్రామ వాలంటీర్లు వున్నారు కదా.. అది కష్టమైన ప్రక్రియ కాదు..’ అని అధికార పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం.

నిజమే, అభిప్రాయ సేకరణ అనేది కష్టమైన వ్యవహారం కాదు. కానీ, దానికంటూ ఓ సమయం – సందర్భం అవసరం కదా.! నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది వ్యవహారం. గ్రామ వాలంటీర్లకు ఆరోగ్య భద్రత కల్పించడం మంచిదేగానీ, వాళ్ళే కరోనా వైరస్‌ వాహకాలుగా మారే పరిస్థితి వస్తే..? వారి ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి రాజకీయం నడుపుతోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.

జూన్‌లో స్కూళ్ళు తెరుచుకోవాల్సి వుంది. కానీ, కరోనా వైరస్‌ – ప్రపంచ పరిణామాలు చూశాక, ఈ ఏడాది విద్యా సంవత్సరంపై చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయినా, వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి ఎందుకీ మొండితనం.? హైకోర్టులో మొట్టికాయలు పడ్డాక కూడా, అడ్డదారులు వెతుక్కోవడంలో ఆంతర్యమేమిటి.? ఇంగ్లీషు మీడియం వద్దని ఎవరూ చెప్పడంలేదు. కానీ, ఇంగ్లీషు మీడియం పేరుతో, తెలుగు మీడియం అనేదే లేకుండా చేయాలన్న ‘కుట్ర’నే ఇప్పుడంతా ప్రశ్నిస్తున్నారు.

మొట్టికాయలు అలవాటైపోయాయ్‌ గనుక మరోసారి ఇదే విషయమై న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా ఫర్లేదనే కోణంలో జగన్‌ సర్కార్‌ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని అనుకోవాలా.?

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

అబ్జర్వేషన్‌: సీఎం జగన్‌.. ఏడాది పాలనకి మార్కులెన్ని.?

సంచలన విజయానికి ఏడాది.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. మొత్తంగా 175 సీట్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి వుంటే, అందులో 151 సీట్లను వైఎస్‌ జగన్‌...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అలాగే రానున్న ఏడాది...

కరోనా ఎఫెక్ట్‌.. 3డి న్యూస్‌ రీడర్స్‌ వచ్చేశారు.!

కరోనా ప్రపంచాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిస్తున్న సమయంలో పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఈ సమయంలో సామాజిక దూరం పాటించే ఉద్దేశ్యంతో జపాన్‌, చైనా, సింగపూర్‌ వంటి అభివృద్ది...

జనవరిలో జరిగిన వుహాన్ విందే నేటి అల్లకల్లోలానికి కారణమా..

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలోనే అయినా.. ఎలా పుట్టిందో.. ఎందుకు ఇంతగా వ్యాపించిందో ఇప్పటికీ సరైన సమాధానం లేదు....

క్రైమ్ న్యూస్: 10 యేళ్ల కొడుక్కు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది

అనారోగ్యంతో పిల్లల బాగోగులు చూసుకోలేక పోతున్నాను అనే బాధతో భార్గవి అనే గృహిణి తన పదేళ్ల కొడుకుకు ఉరి వేసి అతడు చనిపోయిన తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని మృతి చెందింది....