Switch to English

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించిందట. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రశాంత్‌ కిషోర్‌తో ఇటీవల పలు దఫాలుగా చర్చించారట. ఏడాది పాలన నేపథ్యంలో గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ పరిస్థితి ఏమంత బాగా లేదనే ‘ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌’తోనే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట. గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న గుసగుసల సారాంశమిది.

151 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీకి వున్నారు. టీడీపీ నుంచి కొందరు, జనసేన పార్టీకి వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఇప్పటికే వైసీపీ వైపుగా వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి వచ్చిన నష్టమేంటి.? నిజానికి అయితే ఏమీ లేదనే అనుకోవాలి. కానీ, పైకి కన్పించే సీన్‌కీ.. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులకీ చాలా తేడాలుంటాయి. పార్టీలో గత కొంత కాలంగా ఇసుక సమస్య సహా అనేక అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతోన్న విషయంపై వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆందోళనగానే వున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితుల్ని అంచనా వేయడానికి ‘పీకే’ సాయం కోరక తప్పలేదట.

మరోపక్క, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన పీకే టీమ్, ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితుల్ని అంచనా వేస్తూనే వుంది. మరోపక్క, పీకే టీమ్ కి మద్దతుగా ప్రభుత్వం తరఫునే కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటే, ఓ మీడియా కథనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం తరఫునే ఆ సంస్థకు ‘చెల్లింపులు’ కూడా జరుగుతున్నాయన్నది ఆ కథనం సారాంశం. ఓ జిల్లా కలెక్టర్‌ సదరు సంస్థ విషయమై ఆదేశాలు జారీ చేశారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

మండల స్థాయి అధికారుల్ని ప్రభుత్వం నియమిస్తోందట.. వారంతా సదరు సంస్థకు చెందినవారేనట. ఆ సంస్థ అధిపతి, పీకే కోర్‌ టీమ్ సభ్యుడని అంటున్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల విషయంలో అధికార పార్టీపై చాలా ఆరోపణలున్నాయి. ఓ సందర్భంలో ఎంపీ విజయసాయిరెడ్డి, ‘వాలంటీర్‌ పోస్టుల్ని మన పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నాం..’ అని అప్పట్లో చెప్పడం వివాదాస్పదమయిన విషయం విదితమే. మళ్ళీ ఇప్పుడు ఆ వాలంటీర్‌ వ్యవస్థ మీద పెత్తనం కోసం.. అదే సమయంలో పార్టీ వ్యవహారాల కోసం మండల స్థాయి అధికారుల్ని నియమించే ప్రయత్నాలు.. రాజకీయంగా పెను దుమారం రేపనున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వ వెర్షన్‌ ఎలా వుంటుందన్నది వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...