పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వెకేషన్ కోసం మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. విజయవాడలో చికిత్స పొందుతోన్న ఓ వైసీపీ కార్యకర్తను ఆసుపత్రిలో పరామర్శించారు వైఎస్ జగన్.
‘టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త’ అంటూ, వైసీపీ సదరు కార్యకర్త విషయమై విపరీతమైన ఎలివేషన్ ఇస్తోంది. కేవలం, ఇలాంటి పరామర్శల నిమిత్తం తప్ప, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిమిత్తం కావొచ్చు, రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల నిమిత్తం కావొచ్చు, వైఎస్ జగన్.. రాష్ట్రానికి వచ్చింది లేదు.
ఇదిలా వుంటే, వైఎస్ జగన్ ఇంకోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అల్టిమేటం జారీ చేశారు. ‘ఇప్పుడు మీరు అధికారంలోకి వున్నారు. రేపు మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు మా కార్యకర్తలు మేం ఎంత చెప్పినా వినకుండా, మీ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడతారు.. అప్పుడు పరిస్థితుల్ని అంచనా వేయలేం..’ అంటూ హెచ్చరించేశారు వైఎస్ జగన్.
ఇదెక్కడి పంచాయితీ.? టీడీపీ కార్యకర్తల్ని చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలి.. అనడం వరకూ బాగానే వుంది. కానీ, ‘మేం అధికారంలోకి వచ్చాక, మీ అంతు చూస్తాం..’ అన్నట్లుగా హెచ్చరికలు జారీ చేయడమేంటి.? అది కూడా ఐదేళ్ళ తర్వాత అట.! ఈలోగా వైసీపీ కార్యకర్తల భద్రతని వైఎస్ జగన్ ప్రమాదంలోకి నెట్టేసేలా వ్యాఖ్యానించడమేంటి.?
వైసీపీ అధికారంలో వున్నప్పుడు, అ పార్టీ రెబల్ ఎంపీగా వున్న రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ గురించి విన్నాం. టీడీపీ హయాంలో అలాంటి ఘటనలేమీ జరగలేదు కదా.? పోనీ, ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్టయి, జైల్లో వున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీద ఏమైనా అలాంటి టార్చర్ జరిగిందేమో వైఎస్ జగన్ చెప్పాలి.
వైసీపీ హయాంలో, అప్పటి టీడీపీ నేతల్ని అర్థరాత్రి అరెస్టు చేసి, అత్యంత కిరాతకంగా వేధించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో అలాంటివేమైనా జరిగాయా.? జరిగి వుంటే వైఎస్ జగన్ ఆ వివరాల్ని బయటపెట్టాలి.
టీడీపీ హయాంలో 36 మంది వైసీపీ కార్యకర్తల్ని రాజకీయ కారణాలతో హత్య చేశారంటూ వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. ఆ ముప్ఫయ్ ఆరు మంది పేర్లు చెప్పమంటే, మీడియాకి సైతం వైఎస్ జగన్ మొహం చాటేస్తుండడం గమనార్హం.
నిజానికి, చాలామంది వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల్లోనో, విదేశాల్లోనో సేదతీరుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం, బెంగళూరులో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి, వైసీపీ కార్యకర్తలకు దిక్కెవరు.? కూటమి హయాంలో శాంతి భద్రతలు అదుపు తప్పి వుంటే, రాజకీయ కక్ష సాధింపు చర్యలే వుంటే.. వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఎలా వుండేది.?
రాజకీయ హింసని ఎవరూ ప్రోత్సహించకూడదు. ‘మేం అధికారంలోకి వస్తే, మీ అంతు చూస్తాం..’ అని వైఎస్ జగన్ హెచ్చరించడం అత్యంత హేయమైన చర్య. అది వైసీపీ కార్యకర్తల్ని ప్రమాదంలోకి నెట్టేసే చర్య అవుతుందని సాక్షాత్తూ వైసీపీ మద్దతుదారులే సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
ఎంపిక చేసుకుని మరీ, కొందరు కార్యకర్తల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు సరే, వారికి ఆర్థికంగా ఏమైనా భరోసా ఇస్తున్నారా.? ప్చ్.. లేదాయె.!