జగన్ అంటే అబద్ధం.. అబద్ధం అంటేనే జగన్.! ఇది ఇంకోసారి నిరూపితమయ్యింది.! వైసీపీ హయాంలో, వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు ‘బీపీ, షుగర్’ వంటి వ్యాధుల బారిన పడి, ఆ కోపంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.! ఇది స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇచ్చిన స్టేట్మెంటు.!
‘నన్ను తిడితే, మన అభిమానస్తులు కొందరు బీపీ, షుగర్ కారణంగా ఆవేశకావేశాలకు గురయ్యారు..’ అంటూ, అప్పట్లో టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడిని చిత్ర విచిత్రంగా వెనకేసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ముఖ్యమంత్రి హోదాలో.
ఇప్పుడేమో, అసలు టీడీపీ కార్యాలయంపై దాడే జరగలేదంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ దాడి కేసులో అరెస్టయి జైల్లో వున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ని పరామర్శించడానికి వచ్చి సుద్దులు చెబుతున్నారు. సుద్దులు కావివి, సుద్ద అబద్ధాలు.!
టీడీపీ కార్యాయాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేశాయి, తగలబెట్టే ప్రయత్నం చేశాయి. ఆనాటి ఆ ఘటనలో టీడీపీకి చెందిన పలువురు నేతల వాహనాలు తగలబడ్డాయి. టీడీపీ కార్యాలయం దాదాపుగా ధ్వంసమైంది. టీడీపీ కార్యాలయంలో వున్న కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
ఆ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూనే వున్నాయి. విధ్వంసంపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి ప్రభుత్వం చేష్టలుడిగా కూర్చుంది.
ప్రభుత్వాధినేత, ‘అభిమానస్తులకి బీపీ వచ్చింది’ అని చెప్పాక, పోలీసు శాఖ మాత్రం, దోషులపై చర్యలు తీసుకునే పరిస్థితి వుంటుందా.? రివర్స్‌లో టీడీపీ మీదనే అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం చూశాం.
ప్రభుత్వం మారాక, ఆనాటి ఘటనపై విచారణ షురూ అయ్యింది.. అదీ పద్ధతిగా. అధికారంలోకి వస్తూనే కూటమి ప్రభుత్వం, కేసులు నమోదు చేయించి, వైసీపీ నేతల్ని అరెస్టు చేయించి వుండాలి. కానీ, అరెస్టు విషయంలో సంయమనం పాటించింది.
నాటి దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత వ్యక్తిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం చూసీ చూడనట్టుగా ఎలా వదిలేస్తుంది.?
ఆనాటి దాడికి సంబంధించిన విజువల్స్ కావాలనుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన సొంత మీడియా సాక్షి నుంచి వీడియోస్ తెప్పించుకుని చూడొచ్చు. ఏ స్థాయిలో వైసీపీ మూకలు అప్పట్లో
అరాచకం సృష్టించాయో. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతోపాటు, అందులో వున్న సిబ్బందినీ సామూహికంగా హత్య చేసే ఉద్దేశ్యంతో వైసీపీ మూకలు ఈ దారుణానికి తెగబడ్డాయి.
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారమే వుండకూడదు. స్థానిక ఎన్నికల వేళ టీడీపీ నాయకుల మీద హత్యాయత్నాలు.. ఇదిగో, ఇలా రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాల మీద దాడులు.. ఇదేం పద్ధతి.? ‘అభిమానస్తులు – బీపీ, షుగర్’ అంటూ అప్పట్లో కబుర్లు చెప్పి, ఇప్పుడసలు దాడే జరగలేదని జగన్ చెబుతున్నారంటే, జగన్ మానసిక పరిస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.
ఏం, టీడీపీకి అభిమానస్తులు వుండరా.? జనసేనకి, బీజేపీకి అభిమానస్తులు వుండరా.? ఆ అభిమానస్తులకి బీపీ, షుగర్లు లేవా.? వైసీపీ కార్యాలయాల మీదకి దూసుకెళితే.? ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు వైఎస్ జగన్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే అది ఆయన రాజకీయ భవితవ్యానికే మంచిది.