Switch to English

ఆ విషయంలో కేసీఆర్‌ కన్నా జగన్‌కే ఎక్కువ మార్కులట.!

ప్రభుత్వ నిర్ణయాలు బెడిసి కొట్టడం అనేది కొత్త విషయం కాదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని న్యాయస్థానాలు తప్పుపడుతుంటాయి. ఆయా నిర్ణయాల్ని ప్రజలు కావొచ్చు, ప్రతిపక్షాలు కావొచ్చు ప్రశ్నించినప్పుడు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాల్ని ఆశ్రయించినప్పుడు.. వారి వాదనలో నిజముంటే, న్యాయస్థానాలు ప్రజలకు అండగా నిలబడాలి కదా.!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదే పదే తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకున్న విషయం విదితమే. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేసీఆర్‌ సర్కార్‌ న్యాయస్థానాలతో అత్యధికసార్లు మొట్టికాయలు వేయించుకుందంటూ అప్పట్లో తెలంగాణలో విపక్షాలు విమర్శించడం చూశాం. ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధిగమించేసిందట ఈ మొట్టికాయల విషయంలో. ఆంధ్రప్రదేశ్‌లోని విపక్షాల వాదన ఇది.

ఉత్త వాదన మాత్రమే కాదు, అందుకు తగ్గ ఆధారాలు మనకి స్పష్టంగా కన్పిస్తున్నాయి కూడా. అమరావతి రైతుల ఆందోళన, పోలీసుల అత్యుత్సాహంపై న్యాయస్థానాలు వేసిన మొట్టికాయల గురించి వింటూనే వున్నాం. మరోపక్క, ఇంగ్లీషు మీడియం విషయంలోనూ అదే పరిస్థితి. పదే పదే ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నా, ప్రభుత్వం తీరు మారడంలేదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

మామూలుగా ఇలాంటి విషయాల్లో సలహాదారులు అత్యంత కీలక భూమిక పోషించాలి. లక్షలకు లక్షలు గౌరవ వేతనాల్ని సలహాదారులకు ప్రభుత్వం చెల్లించేదే అందుకు. కానీ, సలహాదారులు ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడం లేదన్న విమర్శ గత కొంతకాలంగా చాలా గట్టిగానే విన్పిస్తోంది.

ఈ సలహాదారుల వ్యవస్థ చంద్రబాబుకి ఒకింత సమర్థవంతంగానే పనిచేస్తుంది. అయితే, ఆయన అధికారంలో వున్నప్పుడూ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవనుకోండి. ఈ మధ్య సలహాదారులు.. అనగానే, అందులో సలహాలిచ్చే స్థాయి లేనోళ్ళకీ అవకాశాలు దక్కుతున్నాయి. అదే అసలు సమస్య. అందుకే పదే పదే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం న్యాయస్థానాల్లో మొట్టికాయలు తినాల్సి వస్తోందట. ఏడాది పూర్తి కాకుండానే ఇన్ని మొట్టికాయలంటే.. ముందు ముందు పరిస్థితి ఇంకెలా వుంటుందో.!

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

దూరదర్శిన్‌ ఉద్యోగికి కరోనా.. దిల్లీ స్టూడియో క్లోజ్‌.!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఈ సమయంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా దిల్లీలోని దూరదర్శిన్‌ కేంద్రంలో జాబ్‌...

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను కలిగించేలా సినిమా ఆఫీస్‌ లను ఫిల్మ్‌...

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

కరోనా టెస్టింగ్‌ కిట్‌ మింగేసిన కోతులు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన వారిని కోతులు మరింతగా భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మీరట్‌లో కరోనా అనుమానితుల నుండి స్వీకరించిన శాంపిల్స్‌ను కొన్ని కోతులు మింగేయడంతో...