Switch to English

వైఎస్‌ జగన్‌కి ‘ఆ’ విషయంలో ఫుల్‌ క్లారిటీ

పెన్షన్ల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొన్న మాట వాస్తవం. వివిధ కారణాలతో ఇప్పటికే పెన్షన్లు పొందుతోన్న కొందరికి ఈ నెల పెన్షన్లు అందలేదు. పెన్షన్‌ లబ్దిదారుల లిస్ట్‌ నుంచి తమ పేర్లు గల్లంతవడంతో చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ.. ఇలా చాలా వ్యవహారాలు పెండింగ్‌లో వున్నాయి. వీటికి తోడు ఇళ్ళ పట్టాల వ్యవహారం కూడా ప్రభుత్వానికి ప్రస్తుతం తలనొప్పిగానే మారింది.

పెన్షన్ల విషయంలో రీ-సర్వే చేస్తోంది ప్రభుత్వం రీ-సర్వే తర్వాత ఆందోళనలు వుండవన్నది ప్రభుత్వం వాదన. అయితే, ఆరోగ్యశ్రీ.. రేషన్‌ కార్డుల సంగతేంటి.? అంటే, దానిపైనా ప్రభుత్వం దగ్గరే పూర్తి స్పష్టత లేదాయె. ఇళ్ళ పట్టాల విషయమై జరుగుతున్న ఆందోళనలు ఇంకో ఎత్తు. కొత్త ప్రభుత్వానికి ఇవన్నీ పెను సవాళ్ళ కిందే చెప్పుకోవాలి. అయితే, ముందస్తు ఆలోచనలతో పకడ్బందీగా వ్యవహరిస్తే.. ఈ సమస్యలే వచ్చేవి కావు. అన్నిటిపైనా తనదైన ముద్ర వుండాలనే కోణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు.. సంచలనమవడం సంగతేమోగానీ, వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇళ్ళ పట్టాల వ్యవహారం ఇందుకు మినహాయింపేమీ కాదు.

లబ్దిదారులుగా ఇప్పటికే సంబరపడిపోతోన్నవారిలో ఎంతమందికి ఇళ్ళ పట్టాలు దక్కుతాయన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. వారంతా గ్రామ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.. గ్రామ వాలంటీర్లను బతిమాలుకుంటున్నారు. వారికి సమాధానం చెప్పలేక అధికార యంత్రాంగం నానా తంటాలూ పడుతోంది. అయితే, ఇవన్నీ తాత్కాలిక సమస్యలేననీ.. ఒక్కసారి ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభమయ్యాక.. సమస్యలే వుండవని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. సాక్షాత్తూ మంత్రులే ఈ విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

మరోపక్క, ‘అధికారులు పూర్తిస్థాయిలో సహకరించడంలేదు..’ అన్న వాదన అధికార పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది ఇళ్ళ పట్టాల విషయంలో. కానీ, ‘మేం మా శక్తికి మించి కష్టపడుతున్నాం..’ అని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఏదిఏమైనా, ఏప్రిల్‌ నాటికి.. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఎక్కడా వ్యతిరేకత అన్న మాటకే అవకాశం వుండదని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పూర్తి క్లారిటీతో వున్నారట. ఈలోగా అన్ని వివాదాల్నీ పరిష్కరించెయ్యాలని ఇప్పటికే అటు మంత్రులకి, ఇటు అధికారులకూ స్పష్టమైన ఆదేశాలిచ్చారట. అదే గనుక జరిగితే.. జగన్‌ మోహన్‌రెడ్డి నిఖార్సయిన అడ్మినిస్ట్రేటర్‌ అన్పించుకోగలుగుతారు.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం..

తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు. జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి....

‘కరోనా’ అయితే ఏంటి .? దుబాయిలో దోచేస్తున్నాడు.!

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకుల నుంచి...

టాలీవుడ్‌కి తీపి కబురు సరే.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఎలా.?

తెలుగు సినీ పరిశ్రమకు తీపి కబురు అందబోతోంది. త్వరలో షూటింగులకు అనుమతి లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని, తమ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చిందంటూ ఈ రోజు ప్రభుత్వ పెద్దలను కలిసిన...

ఇకపై అయినా ట్రూకాలర్ ను వదిలేయండి

గత సంవత్సరం ట్రూకాలర్ నుండి భారతీయుల డేటా చౌర్యానికి గురి అయ్యింది అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఆ ఆరోపణలు నిరూపితం కాలేదు. దాంతో ఆ విషయం అప్పటితో ముగిసింది....

బాలయ్య – ఎన్టీఆర్ కాంబో మూవీ.. సాధ్యమయ్యేనా?

నందమూరి బాలకృష్ణ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ అది ఇప్పటివరకూ సాధ్యమవ్వలేదు. బాలయ్య హీరోగా నటించిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో...