నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్.. అని ఓ సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో తనకు తానే ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు.
మరి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌కి కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి.? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి.? అనేది తెలియాలి కదా.? ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికీ, సెంట్రల్ గవర్నమెంట్‌కీ మధ్య జరిగింది.. అంటూ ఆదానీ – సెకీ వ్యవహారంపై నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి.
తనకు మాత్రమే తెలిసిన రీతిలో చిత్ర విచిత్రమైన ప్రెస్ మీట్లు పెడుతుంటారు వైఎస్ జగన్. అదే బాటలో పెట్టిన తాజా ప్రెస్ మీట్‌లో సెకీ ఒప్పందాల విషయమై తనకు సన్మానం చేయాలనీ, అవార్డు కూడా ఇవ్వాలనీ చెప్పడం గమనార్హం.
వైసీపీ సర్కారుకి లంచం ఇచ్చినట్లుగా అదానీ వ్యవహారంలో చార్జిషిటు నమోదైంది.. అదీ, అమెరికాలో.! ఈ విషయమై పెద్దయెత్తున రాజకీయ దుమారం చెలరేగింది. దాంతో, జగన్ మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. లక్ష కోట్లకు పైనే సంపద ఈ ఒప్పందంతో రాష్ట్రానికి వస్తుందని చెప్పుకొచ్చారు.
తన మీద అబాండాలు వేస్తున్నారనీ, అలాంటివారిపై పరువు నష్టం దావా వేస్తామనీ వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. సరే, అదంతా వైఎస్ జగన్ ఇష్టం. కానీ, కేంద్ర ప్రభుత్వానికీ – సెంట్రల్ గవర్నమెంట్‌కీ మధ్య ఒప్పందమేంటి.? తెలుగులో కేంద్ ప్రభుత్వం.. అంటాం. ఇంగ్లీషులో సెంట్రల్ గవర్నమెంట్ అంటాం.
భాష మార్చినంతమాత్రాన రెండూ వేర్వేరు అవుతాయా.? ఇదెక్కడి ఫస్ట్ క్లాస్ తెలివి.? గతంలో, అసెంబ్లీ సాక్షిగా.. ముఖ్యమంత్రి హోదాలోనే, ‘టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజ్ కట్టడానికి బైక్‌ని ఆపి వెళితే..’ అంటూ దిశ ఘటనపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. దాన్ని మించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం.. వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయ్.
ఏదిఏమైనా, అమెరికాలో అదానీపై కేసు వ్యవహారంలో.. సంపద సృష్టి వ్యాఖ్యలు చేయడమేంటో, పరువు నష్టం దావా ఏంటో.. సన్మానాలు, అవార్డులు ఇవ్వాలని అనడమేంటో.! అసలు ఈ ప్రెస్ మీట్లు ఎందుకో ఏమిటో..!
Jagan Reddy's Press Meets: A Goldmine for Memes and Trolls
Jagan Reddy's press meets have become a favorite for trolls and meme creators, overshadowing any serious discourse.
🔶 He bizarrely claims the Union and Central Governments are different.
🔶 He seeks felicitation for… pic.twitter.com/hAGQ2s4sUy
— TeluguBulletin.com (@TeluguBulletin) November 29, 2024