Switch to English

వైఎస్ జగన్.. చెల్లినీ మెప్పించలేకపోయినవ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో పేటెంట్ హక్కులు ముగ్గురికే వున్నాయ్. ఒకరేమో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇంకొకరు వైఎస్ విజయమ్మ.. మరొకరు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వైఎస్ విజయమ్మ పరిస్థితేంటి.? ఆమె జస్ట్ మాజీ ఎమ్మెల్యే మాత్రమే. పైగా మాజీ వైసీపీ నేత కూడా.! వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి కొన్నాళ్ళ క్రితమే ఆమె రాజీనామా చేశారు. కాదు కాదు.. బలవంతంగా ఆమెతో రాజీనామా చేయించారు. ఇక వైఎస్ షర్మిల, తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు.

హెల్త్ యూనివర్సిటీకి వున్న ఎన్టీయార్ పేరు మార్చేసి, వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘అలా ఎలా పేరు మార్చుతారు.?’ అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నిస్తున్నారు. ‘ఎన్టీయార్ కోట్లాదిమంది ప్రజల అభిమానం పొందిన నాయకుడు. ఆయన పేరు మార్చడమేంటి.? వైఎస్సార్ ఆత్మ ఈ విషయాన్ని హర్షించదు. వైఎస్సార్ పేరుని ఇప్పుడు పెట్టినా, రేప్పొద్దున్న ఇంకొకరు ఆ పేరు మార్చేందుకు మనమే అవకాశం ఇచ్చినట్లయ్యింది..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల.

అలా పేరు మార్చడమంటే ఆయా నాయకుల్ని అవమానించడమే అవుతుంది. ఇప్పుడు ఎన్టీయార్‌కి అవమానం జరిగితే, రేప్పొద్దున్న వైఎస్సార్‌కి అవమానం జరుగుతందన్నది షర్మిల వాదన.

‘అదిగో, చెల్లి కూడా వైఎస్ జగన్ ఆలోచనని మెచ్చలేదు. ఇంకెందుకు ముఖ్యమంత్రి పదవిలో వుండడం.? ఇంతకన్నా అవమానకరం ఇంకేముంటుంది.?’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో మాత్రం వైఎస్ జగన్ అస్సలు మడమ తిప్పరు. సీపీఎస్ రద్దు లాంటి విషయాల్లో మడమ తిప్పినట్లుగా.. ఇలాంటి సందర్భాల్లోనే నిజానికి మడమ తిప్పాలి. తప్పదు.!

అసలు పేరులో ఏముంది.? ఇంకా నయ్యం.. ఆ మాత్రం ఇంగితం పాలకులకు వుంటే, తమ పేర్లు.. తమ కుటుంబ సభ్యుల పేర్లను సంక్షేమ పథకాలకు ఏ పాలకుడైనా ఎందుకు పెడతాడు.?

‘మేం తీసుకుంటున్న నిర్ణయాల్ని అందరూ హర్షిస్తున్నారు..’ అంటూ వైసీపీ నేతలు బహు గొప్పగా చెప్పుకుంటుంటారు. ఎక్కడ.? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్న హయాంలో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మడంలేదు సునీతా రెడ్డి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుపుతున్న పార్టీని నమ్మడంలేదు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ. అన్న తీసుకున్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థించడంలేదు సొంత చెల్లి షర్మిల.!

వైఎస్ జగన్ జైలుకు వెళ్ళినప్పుడు వైఎస్ విజయమ్మ రాజకీయం చేసి వుండకపోతే.. షర్మిల పాదయాత్ర చేసి వుండకపోతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడేదా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...