Switch to English

వైఎస్‌ జగన్‌ ఇమేజ్‌కి ‘అంబానీ’ దెబ్బ.!

ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతల్ని కలవడం పారిశ్రామికవేత్తలకు కొత్తేమీ కాదు. దేశంలో అంబానీ సోదరులకి వున్న ఇమేజ్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? తమ వ్యాపారాల్ని విస్తరించుకునే క్రమంలో ఏ రాష్ట్రానికి అయినా వెళతారు.. అక్కడి ప్రభుత్వాలతో మంతనాలు జరుపుతారు. ముఖేష్‌ అంబానీ ఈ మధ్యనే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అలాగే కలిశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో ముఖేష్‌ అంబానీ చర్చలు జరపడం రాజకీయంగా పెను దుమారానికే కారణమయ్యింది. అసలు ఇంత దుమారానికి కారణమేంటి.? అంటే, గతంలో ఇదే అంబానీ సోదరులపై వైఎస్సార్సీపీ చేసిన ఆరోపణల్ని సమాధానంగా చెప్పొచ్చు. మామూలు ఆరోపణలు కావవి. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానికి ‘అంబానీలే’ కారణం అని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. వైసీపీ నేతలైతే ఈ ఆరోపణలతో చెలరేగిపోయారు.. రిలయన్స్‌ సంస్థలపై దాడులకు దిగారు కూడా. ఆ కేసుల్లో కొన్ని ఇప్పటికీ విచారణ దశలో వున్నాయి.

రాజకీయ నాయకులెప్పుడూ బాగానే వుంటారు.. వారిని నమ్మి రోడ్డెక్కినోళ్ళే, రోడ్డున పడిపోతారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అంబానీ విషయంలో వైఎస్‌ జగన్‌ మడమ తిప్పారా.? అంటే, ఏ విషయంలో ఆయన మడమ తిప్పలేదని.? మాట తప్పడం, మడమ తిప్పడంలో చంద్రబాబుని మించిపోతున్నారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఇంకోలా.. ఇదీ వైఎస్‌ జగన్‌ తీరు. ఆ మధ్య సన్న బియ్యం విషయంలోనూ, 45 ఏళ్ళకే మహిళలకు పెన్షన్‌ అనే విషయంలోనూ వైఎస్‌ జగన్‌ ఎలా ప్లేటు ఫిరాయించారో చూశాం.

అంతెందుకు, రాజధాని అమరావతి విషయంలోనూ వైఎస్‌ జగన్‌ మాట మార్చేశారు. అయినాగానీ, తండ్రి మరణం విషయంలో.. గతంలో తాను చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోయి, ఇప్పుడెలా అంబానీలతో ఆలింగనం చేసుకుంటున్నారన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాజకీయం అన్నిటినీ మార్చేస్తుంది.. కొత్త విషయాల్ని నేర్పిస్తుంది.. పాత విషయాల్ని మర్చిపోయేలా చేస్తుంది. అయితే, అలా కొత్త కొత్త దారుల్లో పయనించడం ద్వారా వైఎస్‌ జగన్‌ తన ఇమేజ్‌ని తానే డ్యామేజ్‌ చేసుకుంటున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లోనే విన్పిస్తోంది. పైకి మాత్రం, అది రాజకీయం.. అది పరిపాలన.. అంటూ అంబానీతో జగన్‌ భేటీ గురించి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండడం గమనార్హం.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

మూడు లాంతర్ల స్తంభం కూల్చివేతపై టీడీపీ నిరసన

విజయనగరం నిన్న రాత్రి అధికారులు కూల్చి వేసిన మూడు లాంతర్ల స్తంభం ఘటన పట్టణంలో తీవ్ర అలజడి రేపుతోంది. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్తంభాన్ని కూల్చి వేయడం తగదనే...

ఫ్లాష్ న్యూస్: 91 మందికి కరోనా అంటించిన బార్బర్

ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకుంటున్న సమయంలో...

ఫ్లాష్ న్యూస్: ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు.!

విశాఖపట్నం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి అర్థరాత్రి లీకైన స్టెరీన్ గ్యాస్ వలన 12మంది చనిపోగా, కొన్ని వందల మంది అనారోగ్యం పాలైన ఘటన అందరికీ తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ...

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...