పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరుకి జంప్.! తప్పు కదా.. ‘జంప్’ అని మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎలా అనగలం.? ప్చ్.. నువ్వు నేర్పిన విద్యయే కదా.! వీకెండ్ పొలిటీషియన్ అనీ, ఇంకోటనీ.. అప్పట్లో వైఎస్ జగన్, తన రాజకీయ ప్రత్యర్థుల మీద ఇలానే విరుచుకుపడ్డారు మరి.
‘నువ్వు ఏదిస్తావో.. అదే, నీకు తిరిగొస్తుంది..’ అని పెద్దలు అంటుంటారు. దీన్నే దేవుడి స్క్రిప్ట్ అని కూడా అనొచ్చు. విజయవాడ – హైద్రాబాద్ మధ్య కాదు, చిత్రంగా విజయవాడ – బెంగళూరు మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ, వీకెండ్ పొలిటీషియన్.. అనే ట్యాగ్ లైన్‌కి న్యాయం చేస్తున్నారు వైఎస్ జగన్.
వారాంతంలో బెంగళూరు ప్యాలెస్‌కీ.. మిగతా రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్‌కీ.. ఇలా అంకితమైపోయింది, ఇటీవలి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ గజన్ మోహన్ రెడ్డి పరిస్థితి. మధ్యలో పులివెందుల కూడా వెళ్ళి వచ్చార్లెండి.. అది వేరే సంగతి.
తాడేపల్లి ప్యాలెస్‌కి ఈసారి ఎందుకు వచ్చినట్లు.? పార్టీ కార్యకర్తల్ని, ముఖ్య నేతల్ని కలిసేందుకని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాదు కాదు, పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం.. అనే చర్చ కూడా నడుస్తోంది.
అయినా, విజయవాడ – బెంగళూరు మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ, తనకు ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేయడమేంటి.? షటిల్ సర్వీస్ చేసినన్ని రోజులు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదాయె.!
‘జాలిపడి ప్రతిపక్ష హోదా ఇచ్చినా వైఎస్ జగన్, అసెంబ్లీకి రారు.. సో, ఆయనకు ప్రతిపక్ష హోదా దండగ..’ అని టీడీపీ అంటోన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. బెంగళూరుకి వైఎస్ జగన్ వెళ్ళకూడదని ఎవరంటారు.? కాకపోతే, వరదల వేళ వరద బాధితుల్ని పరామర్శించాల్సిన బాధ్యత ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ మీద వుంటుంది కదా.!