Switch to English

ప్చ్.. జగన్ ఏడాది ఆనందం అలా ఆవిరైపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుపొంది శనివారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే, ఏడాది ఆనందం ప్రస్తుతం ఆ పార్టీకి అంతగా లేదు. అది ఏ కరోనా కారణంగా అనుకుంటే పొరపాటే. కరోనా ఉన్నా.. లాక్ డౌన్ ఉన్నా రాష్ట్రంలో అటూ ఇటూ తిరగడానికి, ట్రాక్టర్లతో ర్యాలీలు చేయడానికి అధికార పార్టీలకు అడ్డేముంది? అలాగే వేడుకలు కూడా ఓ రేంజ్ లో నిర్వహించేవారు. కానీ అధికార పార్టీకి ఏపీ హైకోర్టులో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు ఊపిరి సలపనివ్వడంలేదు. ఇప్పటికే 50కి పైగా విషయాల్లో కోర్టులో వ్యతిరేక తీర్పులు చవిచూసిన జగన్ సర్కారుకు తాజాగా ఒకేరోజు మూడు అంశాల్లో ఎదురుదెబ్బ తగిలింది.

దీంతో సీఎం జగన్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడమే కాకుండా దానికి పాడిపంటల కలరింగ్ ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టుతో ఆటలాడొద్దని హెచ్చిరిస్తూ.. సదరు జీవోను కొట్టివేసింది. అలాగే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసింది. విశాఖ డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించింది. ఇలా ఒకేరోజు న్యాయస్థానంలో మూడు ఎదురుదెబ్బలు తగిలేసరికి సీఎం జగన్ తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం.

ఈ అంశంపై శనివారం కొంతమంది పార్టీ ముఖ్యులతో చర్చించిన ఆయన.. ప్రభుత్వ లీగల్ టీం మార్చే అంశంపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. లీగల్ టీం సమర్థంగా లేకపోవడం వల్లే కోర్టులో ప్రతి విషయంలోనూ వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం కొంతకాలంగా పార్టీలో సాగుతోంది. తాజాగా జగన్ ఇదే అంశంపై చర్చించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత విషయాన్ని జగన్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తానికి ఎంతో కొంత సంబరంగా జరగాల్సిన వైసీపీ ఏడాది వేడుకలపై హైకోర్టు నీళ్లు పోసినట్టయింది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

విచారణపై మెత్తబడిన చైనా.. కానీ..

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 వైరస్ పుట్టుకకు చైనాయే కారణమని, ఆ దేశంలోన ల్యాబ్ లోనే ఇది ఉద్భవించిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు చేస్తున్నా చైనా మాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు.....

దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు: మరో లక్షకి 20 రోజులేనా.?

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గత నాలుగైదు రోజులుగా సగటుని 5 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య కూడా...

క్రైమ్ న్యూస్: భార్యను చంపేందుకు ఆ భర్త చేసిన ప్లాన్‌కు ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సూరజ్‌కు అప్పుడే భార్య అంటే విరక్తి పుట్టింది. మరో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని భావించిన సూరజ్‌ ఆమెను చంపేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. అద్బుతమైన...

ఫ్లాష్ న్యూస్: టిక్ టాక్ వీడియో కారణంగా గొర్రెల కాపరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో అటవీ శాక అధికారులు గొర్రెలు కాసుకునే నాగార్జునను అరెస్ట్ చేశారు. అతడు వన్య ప్రాణులను ఇబ్బంది పెడుతూ టిక్ టాక్ వీడియోను చేశాడు. పలు వీడియో లు సోషల్ మీడియాలో...

6 ఏళ్ల ‘మనం’ జర్నీలో ఆసక్తికర విషయాలు కొన్ని.!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియంది కాదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున దిగ్విజయంగా కొనసాగిస్తే.. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ తో...