ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ ట్రై చేస్తూ లాభ పడటం సంగతి అటుంచితే దాని కోసం భారీ మొత్తంలో అప్పుచేసి ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారేమో వారి ఫాలోవర్స్ ని టార్గెట్ చేసి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు పెట్టి యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ మీద కేసులు పెట్టారు. వీరిలో యూట్యూబర్ హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజులు ఉన్నారు. ఈ 11 మంది యూట్యూబర్స్ పై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ వ్యూస్ కోసం యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ తాము డబ్బులు సంపాదించడమే కాకుండా అమాయక ప్రజలు బలయ్యేలా వారు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ల వల్ల ఈ యూట్యూబర్స్ భారీ మొత్తంలో సంపాధించినట్టు తెలుస్తుంది. అలాంటి వారందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్లందరిపై కేసులు పెడుతున్నారు పోలీసులు.