సీడాప్ ద్వారా యువతకు విదేశీ ఉద్యోగావకాశాలు: నారా లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని, రాబోయే ఐదేళ్లలో 50వేల మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

అమరావతిలో జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు సాధించిన 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌ను లోకేష్ అభినందించారు. తొలి బ్యాచ్‌లో 171 మందికి శిక్షణ ఇస్తే, ఇప్పటివరకు 40మంది ఉద్యోగాలు పొందారని, త్వరలోనే మిగిలిన వారికి కూడా అవకాశాలు వస్తాయని తెలిపారు. సీడాప్, ఇండో యూరో సింక్రనైజేషన్, జర్మన్ హెల్త్‌కేర్ భాగస్వామ్యంతో ఈ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ అమలవుతోందని వివరించారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ – “అంతర్జాతీయ అవకాశాలు పొందడం యువత లక్ష్యం కావాలి. చంద్రబాబు గారు ముందుచూపుతో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఎఐ, ఎంఎల్, క్వాంటమ్ టెక్నాలజీలపై దృష్టిసారించారు. విదేశీ భాషల్లో శిక్షణతో మన పిల్లలు గ్లోబల్ స్థాయిలో ముందుకు వెళ్ళాలి. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడం బాబు సూపర్ 6లో ప్రధాన హామీ. ఈ లక్ష్యాన్ని మించి చేరుకోవడానికి మేము కృషి చేస్తున్నాం” అన్నారు.

మహిళా సాధికారిత ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని, అందుకే స్త్రీశక్తి, దీపం-2 వంటి పథకాల ద్వారా మహిళలకు తోడ్పాటు అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. విదేశీ భాషల పరీక్షా కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తామని, చదువుతోపాటు జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇచ్చే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

జర్మనీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ – “ఇక్కడ 15 నుంచి 20వేలు జీతం వస్తుంది. కానీ సీడాప్ శిక్షణతో అక్కడ నెలకు రూ.2.8 లక్షల జీతంతో ఉద్యోగం రావడం కలలాంటిదే” అని చెప్పారు. ప్రైవేట్ కన్సల్టెన్సీలు భారీ ఫీజు అడిగినా, సీడాప్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా శిక్షణ ఇచ్చిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీడాప్ చైర్మన్ గునిపాటి దీపక్ రెడ్డి, ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, సలహాదారు సీతా శర్మ, సీఈఓ నారాయణస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాలీబాల్ ప్రాక్టీస్...

Tollywood: పర్సంటేజీపై పరిశ్రమలో వివాదం..! ఏం జరుగుతుందో..

Tollywood: సినిమాల ప్రదర్శనలో మల్టీప్లెక్స్ లకు ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని తమకు ఇవ్వాలని కొందరు ధియేటర్ యజమానులు గతంలో విన్నవించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని 23...

అడివి శేష్ కొత్త గేమ్ ప్లాన్.. రెండు ప్రాజెక్ట్స్‌తో సర్‌ప్రైజ్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక కథల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Sesh), మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శేష్ రెండు...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభాలు… ధనుస్సు వారికి కొత్త అవకాశాలు

ఏప్రిల్ 15 , 2026 బుధవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం వంటి విషయాల్లో మార్పులు కనిపించవచ్చు....