బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి మీడియా వర్గాల్లో హల్చల్ అవుతుంది.
అదేమిటంటే .. తాజాగా ఈ సినిమాకు సంబందించిన పోరాటాల సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందట. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం అజ్ఞాత కథలతో ఫిక్షన్ స్టోరీ గా తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపిస్తే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపిస్తాడట. ప్రస్తుతం కొమరం భీం కు సంబందించిన పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఏకంగా టైగర్ తో పోరాటం చేస్తున్నాడటని టాక్.
Also Read: ‘సైరా’ కోసం ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్.!
అంటే మన యంగ్ టైగర్ .. మరో ఒరిజినల్ టైగర్ లో తలపడుతున్నాడట. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ అని టాక్. బాహుబలి లో రానా చేసిన బుల్ ఫైట్ ఎంతలా పాపులర్ అయిందో .. ఈ ఫైట్ కూడా అంతకు మించే ఉంటుందని అంటున్నారు. తాజగా ఈ సినిమాకు సంబందించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొమరం భీం గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్ అదిరిపోయేలా ఉంది. అలియా భట్ ఓ హీరోయిన్ గా ఎంపిక అయింది .. మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చ్ఛిత్రాన్ని వచ్చే ఏడాది జులై 30న విడుదల చేస్తారట.
