Switch to English

బర్త్‌డే స్పెషల్‌: పడి లేచిన కెరటంలా దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్

తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎప్పటికి గుర్తుండి పోయే నందమూరి తారక రామారావు వారసత్వంతో బాల నటుడిగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌ చిన్న తనంలోనే రాముడిగా నటించి నిజంగా రాముడు ఇలాగే ఉండేవాడా అనిపించేలా నటించడంతో పాటు ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు.

కేవలం 18 యేళ్ల వయసులోనే హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్‌ మొదటి సినిమాతో నిరాశ పర్చినా రెండవ సినిమా స్టూడెంట్‌ నెం.1 చిత్రంతో వీడు భవిష్యత్తులో నెం.1 హీరో అవుతాడు అంటూ ఇండస్ట్రీ వారితో నందమూరి అభిమానులతో అనిపించుకున్నాడు. ఎన్టీఆర్‌ వరుసగా సక్సెస్‌లను దక్కించుకోక పోయినా కూడా పొందిన సక్సెస్‌లు మాత్రం ఆయన్ను ఎక్కడికో తీసుకు వెళ్లాయి.

రెండు పదుల వయసులోనే అతడు సాధించిన రికార్డులు మరో హీరోకు సాధ్యం కావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌ 20 ఏళ్ల వయసులో నటించిన సింహాద్రి చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను కనుమరుగయ్యేలా చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా రికార్డులు ఇప్పటికి కొన్ని అలాగే ఉన్నాయి అంటే ఏ స్థాయిలో ఆ సినిమా ఆడినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సింహాద్రి తర్వాత నాలుగేళ్లు వరుసగా ఫ్లాప్స్‌ పడ్డా ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో ప్రతి సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ నమోదు అయ్యాయి. మళ్లీ యమదొంగ సినిమాతో ఎన్టీఆర్‌ పుంజుకున్నాడు. ఈసారి కూడా రాజమౌళినే ఎన్టీఆర్‌కు సక్సెస్‌ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కంత్రి, అదుర్స్‌ నిరాశపర్చినా కూడా 2010 సంవత్సరంలో వచ్చిన బృందావనం చిత్రం ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించింది. ఆ తర్వాత మళ్లీ అయిదు సంవత్సరాలు ఎన్టీఆర్‌కు కష్టాలు కంటిన్యూ అయ్యాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్‌ నటించిన శక్తి చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా నిర్మాతకు తీవ్ర నష్టాలు మిగల్చడంతో పాటు ఎన్టీఆర్‌కు కూడా విమర్శలు వచ్చాయి. చాలా సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ కాకున్నా ఎన్టీఆర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కాని శక్తి మాత్రం రెండు రకాలుగా ఫ్లాప్‌ అయ్యింది.

అయిదేళ్ల తర్వాత మళ్లీ టెంపర్‌ చిత్రంతో ఎన్టీఆర్‌ సక్సెస్‌ కొట్టాడు. అప్పటి నుండి కంటిన్యూగా ఎన్టీఆర్‌ సక్సెస్‌లు కంటిన్యూ అవుతున్నాయి. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జై లవకుశ, అరవింద సమేత చిత్రాలు ఎన్టీఆర్‌ స్టామినా మరింతగా పెంచాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో కొమురం భీమ్‌ పాత్రలో నటిస్తున్నాడు.

ఎన్టీఆర్‌ను ప్రతిసారి అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లిన జక్కన్న మరోసారి ఆయన్ను ఆకాశాన నిలుపుతాడని ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈసారి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడం ఖాయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పడి లేచిన కొరటం మరింత బలంగా పైకి లేస్తుంది. అలాగే ఎన్టీఆర్‌ కూడా పడ్డ ప్రతి సారి కూడా మరింత పైకి ఎదుగుతున్నాడు. లావు అయ్యావంటూ విమర్శలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌ తనను తాను నియంత్రించుకుని బరువు తగ్గి ప్రేక్షకులను అభిమానులను అలరించేందుకు ఎంత కష్టపడుతున్నాడో నిన్న విడుదలైన సిక్స్‌ ప్యాక్‌ బాడీ పిక్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది.

20 ఏళ్ల వయసులో ఒక హీరో ఇండస్ట్రీ హిట్‌ దక్కించుకోవడం అంటే అది ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎప్పటికి సాధ్యం కాదు. కనుక ఎన్టీఆర్‌కు ఆ రికార్డు అలాగే పదిలంగా ఉంటుంది.

ఎన్టీఆర్‌ మరెన్నో అద్బుత రికార్డులను సాధించాలని కోరుకుంటూ తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున, ఆయన ఫ్యాన్స్‌ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఫుట్‌ బాల్‌ స్టేడియంలో ప్రేక్షకులకు బదులు బూతు బొమ్మలు

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా అన్ని రంగాలను విభాగాలను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన ఆటలను కూడా కరోనా కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు కూడా...

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...

గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్, షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం.!

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి...