చిన్న వయసులోనే యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్.. ‘Dino Deets’ ప్రారంభం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,265FansLike
57,764FollowersFollow

మంత్రి Nara Lokesh తనయుడు Nara Devaansh చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘Dino Deets’ పేరుతో దేవాన్ష్ ప్రారంభించిన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. డైనోసార్లు, శిలాజాలు, పురాతన జీవుల గురించి వినూత్నంగా, పిల్లలకు అర్థమయ్యే సరళమైన శైలిలో ఈ ఛానల్ రూపొందించబడింది.

‘Dino Deets’ టీజర్‌లో మంత్రి Nara Lokesh కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దేవాన్ష్ తన పాడ్‌కాస్ట్‌ల ద్వారా డైనోసార్ల విశేషాలు, ఫాసిల్స్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు, పురాతన ప్రపంచానికి సంబంధించిన ఎన్నో అరుదైన వివరాలను సరదాగా చెప్పబోతున్నట్లు టీజర్‌లో వెల్లడైంది. చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించే ప్రయత్నంగా ఈ ఛానల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా నారా-నందమూరి కుటుంబ సభ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన కుమారుడు సృష్టిస్తున్న ప్రాచీన ప్రపంచాన్ని ఒక ప్రేక్షకుడిలా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఇప్పటికే చదరంగంలో తన ప్రతిభను నిరూపించుకున్న దేవాన్ష్ గతేడాది ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ‘5334 Problems and Games’ పుస్తకంలోని 175 క్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి ఈ ఘనత సాధించాడు.

యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల ద్వారా కూడా ‘Dino Deets’ ప్రేక్షకులను చేరుకోనుంది. చిన్న వయసులోనే ప్రత్యేకమైన అంశాన్ని ఎంచుకుని ముందుకొచ్చిన దేవాన్ష్ ప్రయత్నంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్...

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు...

Akkineni Akhil: ‘లెనిన్’కు స్టార్ హీరోల సెంటిమెంట్..! వర్కౌట్ అయితే తిరుగులేనట్టే..!

Akkineni Akhil: అక్కినేని.. టాలీవుడ్ లో ఈ ఇంటి పేరు ఓ బ్రాండ్. హీరోలుగా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పిల్లర్ అయితే. ఆయన వారసుడిగా...

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం...

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్...

Colors Swathi: దర్శకుడితో కలర్స్ స్వాతి రెండో వివాహం.. ఫొటోలు వైరల్

Colors Swathi: ప్రముఖ నటి, యాంకర్.. కలర్స్ స్వాతి తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి తెర తీశారు. ఆమె రెండో వివాహం చేసుకున్నారు. తాను...

రాజకీయం

కొరియాతో లోకేష్ కీలక చర్చలు.. ఏపీకి నాలెడ్జ్ ఎకానమీ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కొరియా...

కియాకు లోకేష్ ఆహ్వానం.. ఏపీలో ఈవీ హబ్ ఏర్పాటు చేయండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సియోల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

టీడీపీపై టెట్ విమర్శలు.. జగన్‌కు ప్రభుత్వం కౌంటర్!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. టెట్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం...

ఎక్కువ చదివినవి

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

జోసెఫ్ రావణ్ వ్యవహారం: వైసీపీపై రాజకీయ విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి?

జోసెఫ్ రావణ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మోహన్ దాస్‌తో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై జోసెఫ్ రావణ్ చేసినట్లు...

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం జరిగింది?

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న సినిమా షూటింగ్...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...